Quinton de Kock-Rohit Sharma
Quinton de Kock : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ అదరగొడుతున్నాడు. ఈ మెగా టోర్నీ తరువాత వన్డేలకు గుడ్‌బై చెప్పనున్నట్లు టోర్నీ ఆరంభానికి ముందే డికాక్ వెల్లడించాడు. తన ఆఖరి వన్డే ప్రపంచకప్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. పూణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచులో 100 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఇది డికాక్‌కు నాలుగో సెంచరీ కావడం గమనార్హం. అంతకముందు శ్రీలంక, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ పై శతకాలు బాదాడు.
రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేస్తాడా..?
వన్డే ప్రపంచకప్ ఓ ఎడిషన్‌లో అత్యధిక శతకాలు బాదిన రికార్డు టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పేరు మీద ఉంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఐదు శతకాలు బాదాడు. ఇప్పుడు డికాక్ నాలుగు శతకాలు బాది శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర రికార్డును సమం చేసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఈ మెగాటోర్నీలో సెమీస్ చేరుకునేందుకు దక్షిణాఫ్రికాకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. న్యూజిలాండ్‌తో మ్యాచ్ కాకుండా దక్షిణాఫ్రికా ఈ టోర్నీలో మరో మూడు లేదా నాలుగు మ్యాచులు ఆడే అవకాశం ఉంది. ప్రస్తుతం క్వింటన్ డికాక్ ఉన్న ఫామ్ చూస్తుంటే రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ODI Rankings : అగ్రస్థానానికి మరింత చేరువగా గిల్.. రెండు స్థానాలు ఎగబాకిన రోహిత్, కోహ్లీ డౌన్
?? 4: ??? ?????? ????
A 4️⃣th century for Quinton de Kock in this #CWC23 ???
We are running out of superlatives ?#NZvSA #CWC23 #BePartOfIt pic.twitter.com/aMKiya8FAr
— Proteas Men (@ProteasMenCSA) November 1, 2023
ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్లు..
రోహిత్ శర్మ (భారత్) – 5 శతకాలు 2019 ప్రపంచకప్
కుమార్ సంగక్కర (శ్రీలంక)– 4 శతకాలు 2015 ప్రపంచకప్
క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా)– 4* శతకాలు 2023 ప్రపంచకప్
తాజా శతకంతో దక్షిణాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో డికాక్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో 27 శతకాలో హషీమ్ ఆమ్లా మొదటి స్థానంలో ఉండగా, 25 సెంచరీలో ఏబీ డివిలియర్స్ రెండో స్థానంలో ఉన్నారు.
దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక అత్యధిక వన్డే శతకాలు చేసిన ఆటగాళ్ల జాబితా..
హషీమ్ ఆమ్లా – 27 సెంచరీలు
ఏబీ డివిలియర్స్ -25 సెంచరీలు
క్వింటన్ డికాక్ – 21* సెంచరీలు
గిబ్స్- 21 సెంచరీలు
కలిస్ – 17 సెంచరీలు