ODI Rankings : అగ్ర‌స్థానానికి మ‌రింత చేరువ‌గా గిల్‌.. రెండు స్థానాలు ఎగ‌బాకిన రోహిత్‌, కోహ్లీ డౌన్‌

భార‌త యువ ఆట‌గాడు శుభ్‌మ‌న్ గిల్ అగ్ర‌స్థానానికి మ‌రింత చేరువ అయ్యాడు. ఐసీసీ తాజాగా ప్ర‌క‌టించిన వ‌న్డే ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో గిల్ రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

ODI Rankings : అగ్ర‌స్థానానికి మ‌రింత చేరువ‌గా గిల్‌.. రెండు స్థానాలు ఎగ‌బాకిన రోహిత్‌, కోహ్లీ డౌన్‌

ODI Rankings

Updated On : November 1, 2023 / 4:24 PM IST

ICC ODI Rankings : భార‌త యువ ఆట‌గాడు శుభ్‌మ‌న్ గిల్ అగ్ర‌స్థానానికి మ‌రింత చేరువ అయ్యాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్ర‌క‌టించిన వ‌న్డే ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో 816 రేటింగ్ పాయింట్ల‌తో గిల్ రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. 818 రేటింగ్‌ పాయింట్ల‌తో ఈ విభాగంలో పాకిస్థాన్ స్టార్ ఆట‌గాడు బాబ‌ర్ ఆజాం మొద‌టి స్థానంలో ఉన్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య అంత‌రం కేవ‌లం రెండు పాయింట్లు మాత్ర‌మే. 765 రేటింగ్ పాయింట్ల‌తో క్వింట‌న్ డికాక్ మూడో స్థానంలో, డేవిడ్ వార్న‌ర్ (761) నాలుగో స్థానంలో ఉన్నారు.

ఇక ఇంగ్లాండ్ పై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శ‌ర్మ రెండు స్థానాలు ఎగ‌బాకి 743 రేటింగ్ పాయింట్ల‌తో ఐదో స్థానానికి చేరుకున్నాడు. భార‌త ప‌రుగుల యంత్రం, రికార్డు రారాజు విరాట్ కోహ్లీ రెండు స్థానాలు దిగ‌జారి ఏడో స్థానానికి ప‌డిపోయాడు. అత‌డి ఖాతాలో 735 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. హెన్రిచ్ క్లాసెన్ (741) ఆరు, హ్యారీ టెక్టర్ (729) ఎనిమిది, రస్సీ వాన్ డెర్ డుసెన్‌(706) తొమ్మిది, డేవిడ్ మలన్ (695) ప‌దో స్థానంలో కొన‌సాగుతున్నారు.

Also Read: బుమ్రా ఓ బేబీ బౌల‌ర్‌.. అలా పిల‌వ‌డంలో త‌ప్పేంలేదు.. వింత ప్ర‌క‌ట‌న‌ను స‌మ‌ర్థించిన పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండ‌ర్

అటు బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ పేస‌ర్‌ షహీన్ షా అఫ్రిది అగ్రస్థానంలో ఉన్నాడు. 673 రేటింగ్ పాయింట్లు అత‌డి ఖాతాలో ఉన్నాయి. ఇంత‌క ముందు ఈ స్థానంలో టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఉండ‌గా ఇప్పుడు రెండు స్థానాలు దిగ‌జారి మూడో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియా పేస‌ర్ జోష్ హేజిల్‌వుడ్ (663 ) రెండో స్థానంలో, కెేశవ్ మహరాజ్(651) నాలుగు, ట్రెంట్ బౌల్ట్( 649) ఐదో స్థానంలో ఉన్నారు. ఆ త‌రువాతి స్థానాల్లో రషీద్ ఖాన్ (648), కుల్‌దీప్ యాదవ్ (646), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (641), ఆడమ్ జంపా (637), మహ్మద్ నబీ (631) నిలిచారు.

ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో బంగ్లాదేశ్ కెప్టెన్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ 316 పాయింట్ల‌తో అగ్ర‌స్థాంన‌లో ఉన్నాడు. మ‌హ్మ‌ద్ న‌బీ (297), సికింద‌ర్ ర‌జా(287) వ‌రుస‌గా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో భార‌త్ నుంచి టాప్‌-10లో ఒక్క భార‌త ఆట‌గాడు కూడా లేడు.

Suryakumar Yadav : ముంబయి వీధుల్లో మారువేషంలో కెమెరామెన్ గా సూర్య.. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా? వీడియో వైరల్