IPL 2019: రబాడ కూడా వెళ్లిపోయాడు
- Subhan Ali Shaik
- Published On : May 3, 2019 / 08:18 AM IST
వరల్డ్ కప్ సంరంభానికి సిద్ధమయ్యే క్రమంలో విదేశీ ప్లేయర్లు ఐపీఎల్‌కు దూరమవుతున్నారు. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ జరిగిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఫేసర్ కగిసో రబాడ స్వదేశానికి తిరుగుప్రయాణమైయ్యాడు. ఏప్రిల్ 3వ తేదీ శుక్రవారం దక్షిణాఫ్రికా క్రికెట్ రబాడను స్వదేశానికి తిరిగి వచ్చేయాలని కబరుపెట్టింది.
క్రికెట్ సౌత్ ఆఫ్రికా కబరు విని రబాడ ఐసీసీ వరల్డ్ కప్ 2019కోసం బయల్దేరాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్రకటించింది. ‘దురదృష్టవశాత్తు రబాడకు వెంటనే రమ్మని పిలుపువచ్చింది. మమ్మల్ని గ్రూపు దశలోనే వదిలేసి వెళ్లిపోతున్నాడు. మా జట్టుకు ముందుకు వెళ్లగల నమ్మకముంది’ అని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ తెలిపింది.
ఢిల్లీ క్యాపిటల్స్ గురించి రబాడ మాట్లాడుతూ.. ‘ఈ దశలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను వదిలి వెళ్లడం చాలా కష్టంగా అనిపిస్తోందవి. కానీ, వరల్డ్ కప్‌కు ఇంకా నెలరోజులు సమయం మాత్రమే ఉంది. నా గురించి ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీజన్ నాకు అద్భుతమైనది. మైదానంలో, బయటా బాగా ఎంజాయ్ చేశాం. మా జట్టు ట్రోఫీ గెలుస్తుందనే నమ్మకముంది’ అని ప్రశంసించాడు.
