Rachin Ravindra: సత్తా చాటిన కివీస్ ఓపెనర్.. రచిన్ రవీంద్ర ఖాతాలో మరో ఘనత

న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర.. వన్డే ప్రపంచకప్ లో దూసుకుపోతున్నాడు. కివీస్ తరపున వన్డే ప్రపంచకప్ ఒకే ఎడిషన్లో 5 సార్లు 50 ప్లస్ స్కోరు చేసిన మూడో ప్లేయర్ గా నిలిచాడు.

Rachin Ravindra World Cup Century

Rachin Ravindra: భారతీయ మూలాలున్నన్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర సత్తా చాటుతున్నాడు. తన కెరీర్ లో ఫస్ట్ వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న రచిన్ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. నిలకడైన ఆట తీరుతో ఈ మెగా టోర్నిలో ఆకట్టుకున్నాడు. ధారాళంగా పరుగులు సాధిస్తూ న్యూజిలాండ్ టీమ్ లో కీలక సభ్యుడిగా మారాడు. తన మొదటి ప్రపంచకప్ లోనే 5 సార్లు 50 ప్లస్ స్కోరు చేసిన ఘనత తాజాగా సాధించాడు. ఈ ఘనత సాధించిన ఏడో ప్లేయర్ గా రికార్డు కెక్కాడు.

పాకిస్థాన్ తో బెంగళూరులో ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో రచిన్ రవీంద్ర  సెంచరీ కొట్టాడు. డెవాన్ కాన్వేతో కలిసి బ్యాటింగ్ కు దిగిన రచిన్ పరిస్థితులకు తగ్గట్టు ఆడుతూ శతకం చేశాడు. 88 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ తో సెంచరీ పూర్తిచేశాడు. కాన్వేతో కలిసి తొలి వికెట్ కు 68 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. కాన్వే అవుటైన తర్వాత కెప్టెన్ కేన్ విలియమ్సన్ తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

న్యూజిలాండ్ తరపున వన్డే ప్రపంచకప్ ఒకే ఎడిషన్లో 5 సార్లు 50 ప్లస్ స్కోరు చేసిన మూడో ప్లేయర్ గా రచిన్ రవీంద్ర నిలిచాడు. అతడి కంటే ముందు మార్టిన్ క్రోవ్ (1992), స్కాట్ స్టైరిస్(2007) ఈ ఘనత సాధించారు. కాగా, 523 పైగా పరుగులతో తాజా ప్రపంచప్ లో అత్యధిక పరుగుల లిస్ట్ లో రచిన్ సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఈ ప్రపంచకప్ తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ తో జరిగిన పోరులో రచిన్ సెంచరీ కొట్టాడు. ఆస్ట్రేలియాపైనా, తాజాగా పాకిస్థాన్ మీద సెంచరీలు చేశాడు. ఇండియా, నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు సాధించాడు.

ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన డెబ్యూ ప్లేయర్స్
5 – 1987లో డేవిడ్ బూన్
5 – 1999లో రాహుల్ ద్రవిడ్
5 – 2007లో కవిన్ పీటర్సన్
5 – 2011లో జోనాథన్ ట్రాట్
5 – 2019లో జాసన్ రాయ్
5 – 2019లో బెన్ స్టోక్స్
5 – 2023లో రచిన్ రవీంద్ర*

Also Read: టీమిండియాకు బిగ్ షాక్.. వన్డే వరల్డ్ కప్ నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. యువ బౌలర్ ఎంట్రీ

ట్రెండింగ్ వార్తలు