Radha Yadav
Radha yadav Amazing Catch: ఐసీసీ మహిళ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా బుధవారం రాత్రి ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇండియా భారీ పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. తద్వారా సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చివర్లో సుడిగాలి ఇన్సింగ్ ఆడి 52 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 19.5 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌట్ కావటంతో భారత్ జట్టు 82 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Also Read : IND vs BAN : భారత్‌తో రెండో టీ20 మ్యాచ్.. రిటైర్‌మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్
ఈ మ్యాచ్ లో భారత క్రికెటర్ రాధా యాదవ్ పట్టిన క్యాచ్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే షాక్ తగిలింది. రేణుక వేసిన తొలి ఓవర్ రెండో బంతిని శ్రీలంక ఓపెనర్ విష్మి గుణరత్నె షాట్ ఆడే ప్రయత్నం చేసింది. కానీ, బాల్ గాల్లోకి ఎగిరి బౌండరీకి దగ్గరిలోకి వెళ్లింది. సబ్ స్టిట్యూట్ గా ఫీల్డింగ్ లోకి వచ్చిన రాధా డ్రైవ్ చేసి క్యాచ్ అందుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
RADHA YADAV, WHAT A STUNNER. 🤯 pic.twitter.com/rMSXN8j8gr
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 9, 2024