IND vs BAN : భార‌త్‌తో రెండో టీ20 మ్యాచ్‌.. రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన బంగ్లాదేశ్ సీనియ‌ర్ ఆల్‌రౌండ‌ర్

భార‌త్‌తో రెండో టీ20 మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్‌కు షాక్ త‌గిలింది.

IND vs BAN : భార‌త్‌తో రెండో టీ20 మ్యాచ్‌.. రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన బంగ్లాదేశ్ సీనియ‌ర్ ఆల్‌రౌండ‌ర్

Mahmudullah to retire from T20s after India series

Updated On : October 9, 2024 / 10:20 AM IST

IND vs BAN 2nd T20 : భార‌త్‌తో రెండో టీ20 మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్‌కు షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు సీనియ‌ర్ ఆట‌గాడు మ‌హ్మ‌దుల్లా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. అక్టోబ‌ర్ 12న భార‌త్‌తో హైద‌రాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మూడో టీ20 మ్యాచే పొట్టి ఫార్మాట్‌లో త‌న‌కు ఆఖ‌రిద‌ని వెల్ల‌డించాడు. కాగా.. నేడు ఢిల్లీ వేదిక‌గా భార‌త్‌, బంగ్లాదేశ్ జ‌ట్లు రెండో టీ20 మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి.

39 ఏళ్ల మ‌హ్మ‌దుల్లా 2021లోనే టెస్టుల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. ఇక వ‌న్డేల్లో మాత్రం వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027 వ‌ర‌కు కొన‌సాగుతాన‌ని మాత్రం స్ప‌ష్టం చేశాడు. ఆల్‌రౌండ‌ర్‌గా బంగ్లాదేశ్ విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించాడు. బంగ్లాదేశ్ తరఫున మహ్మదుల్లా 50 టెస్టులు, 232 వన్డేలు, 139 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 2914 ప‌రుగులు 43 వికెట్లు, వ‌న్డేల్లో 5386 ప‌రుగులు 82 వికెట్లు, టీ20ల్లో 2394 పరుగులు, 40 వికెట్లు తీశాడు.

Harmanpreet Kaur: ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఫిట్‌నెస్‌పై కీలక అప్‌డేట్

‘టీ20 క్రికెట్ కు వీడ్కోలు చెబుతున్నాను. భార‌త్‌తో జ‌రిగే మూడో టీ20 మ్యాచే నా కెరీర్‌లో ఆఖ‌రి పొట్టి ఫార్మాట్‌లో ఆడే మ్యాచ్‌. భార‌త్‌కు వ‌చ్చే ముందే ఈ నిర్ణ‌యం తీసుకున్నాను. కుటుంబ స‌భ్యుల‌తో, కోచ్‌, కెప్టెన్‌, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో ఈ విష‌యం పై ఇప్ప‌టికే చ‌ర్చించాను. టీ20లకు వీడ్కోలు ప‌లికేందుకు ఇదే స‌రైన స‌మ‌యంలా అనిపించింది. మ‌రో రెండేళ్ల‌లో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నుంది. కేవ‌లం వ‌న్డే క్రికెట్ పైనే ఫోక‌స్ చేయాల‌ని భావిస్తున్నాను.’ అని మ‌హ్మ‌దుల్లా అన్నాడు.

భారత్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో మ‌హ్మ‌దుల్లా రెండు బంతులు ఆడి ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేశాడు. అరంగ్రేట బౌల‌ర్ మ‌యాంక్ యాద‌వ్ బౌలింగ్‌లో మ‌హ్మ‌దుల్లా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

ENG vs PAK 1st Test: అయ్యో బాబర్‌ అజామ్‌.. నీ ఆట మేము చూడలేము స్వామి.. 16 ఇన్సింగ్స్ లో ఎన్ని పరుగులు చేశాడో తెలుసా?