Harmanpreet Kaur: ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఫిట్‌నెస్‌పై కీలక అప్‌డేట్

హర్మన్ ప్రీత్ కౌర్ గాయంపై భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కీలక అప్ డేట్ ఇచ్చారు. బుధవారం శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో హర్మన్ ప్రీత్..

Harmanpreet Kaur: ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఫిట్‌నెస్‌పై కీలక అప్‌డేట్

Harmanpreet Kaur

Updated On : October 9, 2024 / 7:09 AM IST

Women T20 World Cup 2024: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఇవాళ (బుధవారం) రాత్రి 7.30గంటలకు కీలక మ్యాచ్ జరగనుంది. శ్రీలంక మహిళా జట్టును భారత్ మహిళల జట్టు ఢీకొట్టనుంది. ఈ టోర్నీలో భారత్ జట్టు ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఆడగా.. మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై ఓడిన విషయం తెలిసిందే. అయితే, ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టుపై విజయం సాధించింది. భారత్ జట్టు సెమీస్ కు చేరాలంటే ఇవాళ శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి. పాక్ తో మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో భారత్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మెడ గాయం కారణంగా రిటైర్ హర్ట్ గా వెనుతిరిగింది. దీంతో ఆమె శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో ఆడుతుందా లేదా అనే విషయంపై సందిగ్దం నెలకొంది.

Also Read:  Champions Trophy Final : ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా క్వాలిఫై అయితే.. ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్‌‌లో కాదు.. మరెక్కడంటే?

హర్మన్ ప్రీత్ కౌర్ గాయంపై భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కీలక అప్ డేట్ ఇచ్చారు. బుధవారం శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ ఆడుతుందని, జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తుందని స్మృతి తెలిపింది. మరోవైపు పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆడలేకపోయిన పూజా వస్త్రాకర్ ఫిట్ నెస్ పై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై స్మృతి మంధాన మాట్లాడుతూ.. పూజా వస్త్రాకర్ ఆడేది లేనిది వైద్య సిబ్బంది నివేదికను బట్టి ఉంటుంది. ఇప్పుడే ఏం చెప్పలేమని తెలిపింది. టోర్నీలో పరిస్థితులు మా అంచనాలకు భిన్నంగా ఉన్నాయి. పాకిస్థాన్ తో మ్యాచ్ లో రన్ రేట్ మెరుగు పర్చుకోవాలనే అనుకున్నాం. కానీ ముందు మ్యాచ్ గెలవడంపై దృష్టి పెట్టామని స్మృతి పేర్కొంది.

 

స్మృతి మంధాన కూడా వరుస మ్యాచ్ లలో విఫలమవుతూ వస్తోంది. ముఖ్యంగా టీ20 ప్రపంచ కప్ లో పేవలమైన బ్యాటింగ్ ఫామ్ తో స్మృతి ఇబ్బంది పడుతోంది. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 12 పరుగులకే ఔట్ కాగా.. పాక్ పై మ్యాచ్ లో కేవలం ఏడు పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విషయంపై స్మృతి స్పందిస్తూ.. వరుస మ్యాచ్ లలో నా ఆరంభం బాగా లేదు. ముఖ్యంగా పాక్ తో జరిగిన మ్యాచ్ లో డాట్ బాల్స్ ఆడేసరికి అసహనానికి గురై వికెట్ ఇచ్చేశాను. ఇక్కడి వికెట్లపై బ్యాటర్లు తెలివిగా ఆడాలని పేర్కొంది.