Champions Trophy Final : ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా క్వాలిఫై అయితే.. ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్‌లో కాదు.. మరెక్కడంటే?
Champions Trophy Final : ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‌లకు క్వాలిఫై అయితే, ఫైనల్‌తో సహా పాకిస్తాన్ నుంచి తరలించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదేగానీ జరిగితే.. దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించవచ్చని నివేదిక వెల్లడించింది.

Champions Trophy Final Could be Held in Dubai Instead of Pakistan's Lahore
Champions Trophy Final : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరుగనుంది. అది దయాది పాకిస్థాన్ గడ్డ పైనా లేదా మరెక్కడ? అనేది ఆసక్తి నెలకొంది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం.. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్‌లోని లాహోర్, కరాచీ, రావల్పిండిలో జరగాల్సి ఉంది. ఎందుకంటే మార్క్యూ టోర్నమెంట్ ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఈ ఫైనల్ మార్చి 9న జరుగుతుంది.
నివేదిక ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‌లకు క్వాలిఫై అయితే, ఫైనల్‌తో సహా పాకిస్తాన్ నుంచి మరో చోటుకు తరలించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదేగానీ జరిగితే.. లాహోర్ నుంచి తరలించి దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించవచ్చని నివేదిక వెల్లడించింది.
మే 9న ఫైనల్ నిర్వహించేందుకు కన్ఫర్మ్ చేయగా దీనిపై తుది నిర్ణయం మార్చి 6 వరకు పట్టవచ్చు. అబుదాబి, షార్జాలను కూడా పరిగణనలోకి తీసుకోవడంతో సెమీ-ఫైనల్‌లకు కూడా అదే వర్తించే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త రాజకీయ సంబంధాల కారణంగా 2008 జూలై నుంచి భారత్ తన జట్టును పాకిస్థాన్‌కు పంపలేదు. రాబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ దేశంలోనే జరుగుతుందని, చిరకాల ప్రత్యర్థి భారత్‌తో సహా అన్ని జట్లు టోర్నీలో పాల్గొంటాయని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ విశ్వాసం వ్యక్తం చేశారు.
పాక్‌కు టీమిండియా రావాలి.. అన్నిజట్లకు ఆతిథ్యం ఇస్తాం : మొహ్సిన్ నఖ్వీ
‘‘భారత జట్టు రావాలి. వారు పాక్ రావడాన్ని రద్దు లేదా వాయిదా వేస్తారనేది నాకు కనిపించడం లేదు. మేం పాకిస్తాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని జట్లకు ఆతిథ్యం ఇస్తామని విశ్వసిస్తున్నాం ”అని నఖ్వీ చెప్పాడు. భారత్‌తో సహా అన్ని జట్లకు ఆతిథ్యం ఇవ్వడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉందన్నాడు. షెడ్యూల్ ప్రకారం.. అన్ని సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పాడు. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి స్టేడియంలు కూడా సిద్ధంగా ఉంటాయి. టోర్నమెంట్ తర్వాత మిగిలిన పనులు పూర్తవుతాయని నఖ్వీ పేర్కొన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడేందుకు తుది నిర్ణయం భారత ప్రభుత్వమే తీసుకుంటుందని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా గతంలో ప్రకటించారు. గత ఏడాదిలోఆసియా కప్ కోసం పాకిస్థాన్‌కు వెళ్లేందుకు భారత ప్రభుత్వం నిరాకరించిందని బీసీసీఐ పేర్కొంది. చాలా చర్చల తర్వాత కాంటినెంటల్ టోర్నమెంట్‌ను పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాయి.
చివరిగా 2017లో జరిగిన ఈ టోర్నీ ముసాయిదా షెడ్యూల్ ప్రకారం.. టీమిండియాతో పాటు పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లు గ్రూప్ ఏలో ఉండగా, గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌లు నిలిచాయని తాజా నివేదిక పేర్కొంది. ఛాంపియన్స్ ట్రోఫీ అనేది 1996 వన్డే ప్రపంచ కప్ తర్వాత పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న మొదటి ప్రపంచ ఐసీసీ ఈవెంట్ కాగా.. భారత్, శ్రీలంకతో కలిసి ఆతిథ్యం అందించాయి.