ENG vs PAK 1st Test: అయ్యో బాబర్‌ అజామ్‌.. నీ ఆట మేము చూడలేము స్వామి.. 16 ఇన్సింగ్స్ లో ఎన్ని పరుగులు చేశాడో తెలుసా?

డిసెంబర్ 2022లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు క్రికెట్ లో బాబర్ అజామ్ 50కి మించి స్కోరు సాధించాడు. ఆ సమయంలో బాబర్ 161 పరుగుల అధ్బుతమైన ఇన్సింగ్స్ ఆడాడు.

ENG vs PAK 1st Test: అయ్యో బాబర్‌ అజామ్‌.. నీ ఆట మేము చూడలేము స్వామి.. 16 ఇన్సింగ్స్ లో ఎన్ని పరుగులు చేశాడో తెలుసా?

Babar Azam

Updated On : October 8, 2024 / 7:58 AM IST

Babar Azam: పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్ బాబర్‌ అజామ్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అయ్యో బాబర్.. నీ ఆట మేము చూడలేము స్వామి అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ముల్తాన్ వేదికగా అతిథ్య పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఇటీవలే పాకిస్థాన్ వన్డే, టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న బాబర్ అజం బ్యాడ్ టైం కొనసాగుతూనే ఉంది. గత 651 రోజులుగా ఏ టెస్టు మ్యాచ్ లోనూ బాబర్ 50 పరుగుల మార్కును చేరుకోలేదు. తాజాగా జరుగుతున్న పాక్ వర్సెస్ ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ లోనూ బాబర్‌ అజామ్‌ కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు. ఆ 30 పరుగులు చేసేందుకు బాబర్ 71 బాల్స్ ఆడాడు. దీంతో స్టేడియంలోని వీక్షకులు బాబర్ బ్యాటింగ్ చేస్తుంటే ఇక మేము నిద్రపోతాము అన్నట్లుగా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.

Also Read: Hardik Pandya : చ‌రిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. కోహ్లీ రికార్డు బ్రేక్‌.. ఒకే ఒక భార‌త ప్లేయ‌ర్‌

డిసెంబర్ 2022లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు క్రికెట్ లో బాబర్ అజామ్ 50కి మించి స్కోరు సాధించాడు. ఆ సమయంలో బాబర్ 161 పరుగుల అధ్బుతమైన ఇన్సింగ్స్ ఆడాడు. కానీ, ఆ తరువాత ఏఒక్క ఇన్నింగ్స్ లోనూ బాబర్ 50 పరుగుల స్కోర్ ను చేరుకోలేదు. బాబర్ న్యూజిలాండ్ పై 161 పరుగుల సెంచరీ తరువాత 16 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేశాడు. అతను చేసిన మొత్తం స్కోర్ కేవలం 318 పరుగులు మాత్రమే. అందులోనూ ఇన్నింగ్స్ అత్యధిక స్కోర్ 40 పరుగులు మాత్రమే. దీంతో బాబర్ అజం బ్యాటింగ్ తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.

 

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో బాబర్ అజం టెస్టుల్లో 4వేల పరుగులు చేరుకోవాలంటే 38 పరుగులు చేయాల్సి ఉంది. కానీ, 30 పరుగులకే బాబర్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం అతను 4వేల టెస్టు పరుగులు పూర్తి చేసేందుకు 8 పరుగులు చేయాల్సి ఉంది. బాబర్ కంటే ముందు పాకిస్థాన్ నుంచి మొత్తం 11 మంది బ్యాటర్లు 4వేలకు పైగా టెస్టు పరుగులు సాధించారు. మరోవైపు ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫిక్ (102), షాన్ మసూద్ (151) పరుగులు చేశారు. నషీమ్ షా (0 నాటౌట్), సౌద్ షకీల్ (35 నాటౌట్) క్రీజులో ఉన్నారు.