Hardik Pandya : చ‌రిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. కోహ్లీ రికార్డు బ్రేక్‌.. ఒకే ఒక భార‌త ప్లేయ‌ర్‌

గ్వాలియ‌ర్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భార‌త్ 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

Hardik Pandya : చ‌రిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. కోహ్లీ రికార్డు బ్రేక్‌.. ఒకే ఒక భార‌త ప్లేయ‌ర్‌

Kohli T20 Record Broken Hardik Pandya Makes History For India

Updated On : October 7, 2024 / 3:11 PM IST

Hardik Pandya – Virat Kohli : గ్వాలియ‌ర్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భార‌త్ 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ల‌క్ష్య‌ఛేద‌న‌లో ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. ఫ‌లితంగా భార‌త్ ల‌క్ష్యాన్ని 11.5 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ 16 బంతుల‌ను ఎదుర్కొన్నాడు. 5 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 39 ప‌రుగుల‌తో అజేయ ఇన్నింగ్స్‌ను ఆడాడు. సిక్సర్‌తో భార‌త్‌కు విజ‌యాన్ని అందించాడు.

ఈ క్ర‌మంలో హార్దిక్ పాండ్యా ఓ అరుదైన రికార్డును సాధించాడు. భార‌త్ త‌రుపున అత్య‌ధిక సార్లు సిక్స‌ర్‌తో మ్యాచ్ ఫినిష్ చేసిన ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. అంత‌ర్జాతీయ టీ20 మ్యాచుల్లో ఛేజింగ్‌లో భార‌త్ త‌రుపున మ్యాచ్‌ను సిక్స‌ర్‌తో ఫినిష్ చేయ‌డం హార్దిక్‌కు ఇది ఐదోసారి.

Preity Zinta : ఎట్ట‌కేల‌కు ప్రీతి జింటా కోరిక నెర‌వేరింది.. ఆనందానికి అవ‌ధులు లేవు!

గ‌తంలో ఈ రికార్డ్ కోహ్లీ పేరిట ఉండేది. కోహ్లీ నాలుగు ప‌ర్యాయాలు ఇలా చేశాడు. ఇక ఆ త‌రువాతి స్థానాల్లో ఎంఎస్ ధోని, రిష‌బ్ పంత్‌లు ఉన్నారు. వీరిద్ద‌రూ చెరో మూడు సిక్స‌ర్లతో మ్యాచ్‌ల‌ను ముగించారు.

అత్య‌ధిక సార్లు టీమ్ఇండియా త‌రుపున సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించిన ప్లేయ‌ర్లు..

హార్దిక్ పాండ్యా – 5 సార్లు
విరాట్ కోహ్లీ – 4 సార్లు
ఎంఎస్ ధోని – 3 సార్లు
రిష‌బ్ పంత్ – 3 సార్లు

IND vs BAN : తొలి టీ20లో ఓట‌మి.. బ్యాటింగ్ విభాగం పై బంగ్లాదేశ్ కెప్టెన్ సంచ‌ల‌న కామెంట్స్‌..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవ‌ర్ల‌లో 127 ప‌రుగుల‌కే ఆలౌటైంది. అనంత‌రం ల‌క్ష్యాన్ని భార‌త్ 11.5 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో హార్దిక్ పాండ్యా(39 నాటౌట్‌), సూర్య‌కుమార్ యాద‌వ్ (29), సంజూ శాంస‌న్ (29) వేగంగా ఆడాడు.