Preity Zinta : ఎట్టకేలకు ప్రీతి జింటా కోరిక నెరవేరింది.. ఆనందానికి అవధులు లేవు!
ఎట్టకేలకు తన జట్టు కప్పును ముద్దాడాలనే బాలీవుడ్ నటి ప్రీతి జింటా కోరిక నెరవేరింది.

Preity Zinta finally wins a T20 league trophy Kings franchise lift maiden trophy as St Lucia Kings win CPL 2024
Preity Zinta : ఎట్టకేలకు తన జట్టు కప్పును ముద్దాడాలనే బాలీవుడ్ నటి ప్రీతి జింటా కోరిక నెరవేరింది. అయితే ఇది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరపున కాదులెండి. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లోని సెయింట్ లూసియా కింగ్స్ తరుపున. గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచులో సెయింట్ లూయిస్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ కో ఓనర్స్ అయిన ప్రీతిజింటా, నెస్ వాడియా, మోహిత్ బుమ్రాన్, కరన్ పాల్‌లు సెయింట్ లూసియాకు కూ సహ యజమానులే.
ఈ మ్యాచ్‌లో గయనా జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. గయానా బ్యాటర్లలో ప్రిటోరియస్ (12 బంతుల్లో 25), షై హోప్ (22) లు రాణించారు. లూసియా బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఖారీ, ఫోర్డె, అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్, డేవిడ్ వైస్ తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం సెయింట్ లూసియా కింగ్స్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. లూసియా కింగ్స్ బ్యాటర్లలో ఆరోన్ జోన్స్ (31 బంతుల్లో 48 నాటౌట్), రోస్టన్ ఛేజ్ (22 బంతుల్లో 39 నాటౌట్) దూకుడుగా ఆడారు. కెప్టెన్ డుప్లెసిస్ (21 బంతుల్లో 21) ఫర్వాలేదనిపించాడు.
చివరి 5 ఓవర్లలో..
చివరి 5 ఓవర్లలో సెయింట్ లూసియా కింగ్స్ విజయానికి 66 పరుగులు కావాల్సి ఉంది. ఈ దశలో ఆరోన్ జోన్స్, రోస్టన్ ఛేజ్ లు చెలరేగారు. మూడు వరుస ఓవర్లలో 27, 20, 18 పరుగులు సాధించారు. దీంతో ఆఖరి రెండు ఓవర్లలో విజయానికి ఒక్క పరుగు మాత్రమే అవసరం కాగా.. 18.1వ ఓవర్‌లో ఇమ్రాన్ తాహిర్ వేసిన బంతి వైడ్‌గా మారడంతో కింగ్స్ విజేతగా నిలిచింది.
IND vs BAN : తొలి టీ20లో ఓటమి.. బ్యాటింగ్ విభాగం పై బంగ్లాదేశ్ కెప్టెన్ సంచలన కామెంట్స్..
Finally a trophy for the Kings franchise.
– Preity Zinta, the happiest lady today. pic.twitter.com/cYTF7ymz5C
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 7, 2024