Suryakumar Yadav : బంగ్లాదేశ్ పై తొలి టీ20లో విజయం.. అదో పెద్ద తలనొప్పి అంటూ భారత కెప్టెన్ సూర్య కామెంట్స్..
మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది.

Suryakumar Yadav comments after win 1st t20 against bangladesh
Suryakumar Yadav : మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. గ్వాలియర్ వేదికగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచులో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్యాన్ని భారత్ 11.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి మాత్రమే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలుపొందడంలో టీమ్ఇండియా బౌలర్లు కీలక పాత్ర పోషించారు. బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.
ఇక మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. టీమ్ ప్రణాళికలను తగ్గట్లుగా రాణించడంతోనే బంగ్లాపై విజయం సాధించామని చెప్పుకొచ్చాడు. ఇక జట్టులో నాణ్యమైన బౌలర్లు ఉండడమూ ఒక్కొసారి కెప్టెన్‌కు తలనొప్పిగా మారుతుందన్నాడు.
IND vs BAN : అరంగ్రేటంలోనే మయాంక్ యాదవ్ అరుదైన రికార్డు..
సమిష్టి ప్రదర్శనతో విజయం సాధించినట్లుగా చెప్పుకొచ్చాడు. జట్టు సమావేశాల్లో ఏం మాట్లాడుకున్నామో దాన్ని మైదానంతో సరిగ్గా అమలు చేసినట్లు వెల్లడించాడు. ప్రతి ఒక్క ఆటగాడు కూడా తమ వంతు బాధ్యతను నిర్వర్తించాడని చెప్పారు. ఇక్కడ బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదని, అయినప్పటికి బ్యాటర్లు దూకుడుగా ఆడి మ్యాచ్‌ను గెలిపించారన్నాడు.
ఇక కెప్టెన్‌గా తనకు తలనొప్పి బౌలింగ్ సమయంలో ఎదురైనట్లు సూర్య చెప్పాడు. మైదానంలో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలనేది తనకు అర్థం కాలేదన్నాడు. ఎక్కువ మంది నాణ్యమైన బౌలర్లు ఉన్నప్పుడు ఇలా జరుగుతుందన్నాడు. ఇది ఓ రకంగా జట్టుకు మంచిదేనన్నాడు. ఇంకా తాము ఏ ఏ అంశాల్లో మెరుగు కావాల్సి ఉందన్న దానిపై దృష్టి పెడతాడని చెప్పాడు. ఇక రెండో టీ20లో మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని సూర్య తెలిపాడు.
IND vs BAN : తొలి టీ20లో ఓటమి.. బ్యాటింగ్ విభాగం పై బంగ్లాదేశ్ కెప్టెన్ సంచలన కామెంట్స్..