IND vs BAN : అరంగ్రేటంలోనే మయాంక్ యాదవ్ అరుదైన రికార్డు..
టీమ్ఇండియా యువ పేసర్ మయాంక్ యాదవ్ అరంగ్రేటం మ్యాచులోనే అరుదైన ఘనత సాధించాడు.

Mayank Yadav joins exclusive club with special maiden over on T20I debut
IND vs BAN : టీమ్ఇండియా యువ పేసర్ మయాంక్ యాదవ్ అరంగ్రేట మ్యాచులోనే అరుదైన ఘనత సాధించాడు. గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచులో అతడు దీన్ని అందుకున్నాడు. మయాంక్ ఈ మ్యాచ్‌లో తన తొలి ఓవర్‌ను మొయిడిన్ గా వేశాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం మ్యాచులో మెయిడిన్ ఓవర్ వేసిన మూడో భారత ఆటగాడిగా మయాంక్ యాదవ్ రికార్డులకు ఎక్కాడు.
మయాంక్ యాదవ్ కంటే ముందు అజిత్ అగార్కర్, అర్ష్‌దీప్ సింగ్‌లు ఈ ఫీట్ సాధించారు. 2006లో జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అగార్కర్ ఈ ఘనత సాధించాడు. ఇక 2022లో సౌతాంప్టన్‌లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచులో అర్ష్‌దీప్ సింగ్ దీన్ని నమోదు చేశాడు. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్‌తో మ్యాచులో మయాంక్ సాధించాడు.
IND vs BAN : తొలి టీ20లో ఓటమి.. బ్యాటింగ్ విభాగం పై బంగ్లాదేశ్ కెప్టెన్ సంచలన కామెంట్స్..
ఇక ఈ మ్యాచ్‌లో మయాంక్ యాదవ్ 4 ఓవర్లు వేశాడు. 21 పరుగులు ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఐపీఎల్‌లో తన స్పీడ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన మయాంక్ బంగ్లాతో మ్యాచ్‌లోనూ 149.9 కి.మీ వేగంతో బంతులను విసిరాడు.
ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసింది. 19.5 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బ్యాటర్లలో మెహిదీ హసన్ మిరాజ్ (32 బంతుల్లో 35 నాటౌట్), నజ్ముల్ హోస్సేన్ షాంటో (27) లు రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్‌లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మయాంక్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్‌లు తలా ఓ వికెట్ తీశారు.
IND vs BAN T20: వావ్.. హార్దిక్ పాండ్యా ఎంత తేలిగ్గా సిక్స్ కొట్టాడో చూశారా.. వీడియో వైరల్
అనంతరం భారత్ 11.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. టీమ్ఇండియా బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(39 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (29), సంజూ శాంసన్ (29) వేగంగా ఆడాడు. బంగ్లా బౌలర్లలో మెహిదీ హసన్ మిరాజ్, ముస్తాఫిజుర్‌లు చెరో వికెట్ సాధించారు.