Rahul Sipligunj surprised his fiancee Harinya Reddy
Rahul Sipligunj : సింగర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే ఓ ఇంటి వాడు కానున్నాడు. గురువారం (నవంబర్ 27న) హరిణ్య మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. వీరి వివాహ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇటీవలే కాబోయే జంట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ వివాహానికి ఆహ్వానించారు.
ఇప్పటికే వీరి పెళ్లి సందడి మొదలైంది. తాజాగా సంగీత్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. కాగా.. ఈ వేడుకలో తనకు కాబోయే భార్య హరిణ్యకు సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఓ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. హరిణ్యకు టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అంటే ఎంతో ఇష్టమట. ఈ క్రమంలో చాహల్‌ను సంగీత్‌కు ఆహ్వానించాడు రాహుల్.
ఈ వేడకకు వచ్చిన చాహల్ కాబోయే వధూవరులతో కలిసి సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మరీ హరిణ్య తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
ఇలాంటి సర్‌ప్రైజ్ ఇచ్చినందుకు రాహుల్‌కు ధన్యవాదాలు తెలియజేసింది. తన జీవితంలో ఈ క్షణాలను ఎప్పటికి మరిచిపోలేనని అంది. తాను చాహల్‌కు వీరాభిమానినని, ఆయన సంగీత్‌కు వచ్చారంటే నమ్మలేకపోతున్నట్లు చెప్పింది. ఈ సందర్భంగా చాహల్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది.