రాజస్థాన్ ముందు భారీ టార్గెట్ ఉంచిన పంజాబ్ కింగ్స్
శశాంక్ సింగ్ అర్ధ సెంచరీ బాదాడు.

PIC: @IPL (X)
ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఇవాళ జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య 9, ప్రభ్‌సిమ్రన్ 21, మిచెల్ ఓవెన్ 0, నెహాల్ వధేరా 70, శ్రేయాస్ అయ్యర్ 30, శశాంక్ సింగ్ 59 (నాటౌట్), అజ్మతుల్లా 21 (నాటౌట్) పరుగులు చేశారు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, వనిందు హసరంగా, క్వేనా మఫాకా, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ మధ్వల్, ఫజల్‌హాక్ ఫరూఖ్
పంజాబ్ కింగ్స్ జట్టు
ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మిచెల్ ఓవెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్