ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ భారీ రికార్డు.. సూపర్ స్టార్ రజనీకాంత్ వీడియో వైరల్

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ సాధించిన సరికొత్త రికార్డు వెనుక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత సలహా ఉందని మీకు తెలుసా?

Rajinikanth on Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్దు క్రియేట్ చేసింది. ఉప్పల్ మైదానంలో బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ ఈ ఘనత సాధించింది. సన్‌రైజర్స్ టీమ్ ఈ రికార్డు సాధించడం వెనుక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సలహా ఉందని మీకు తెలుసా? ఎలా అని ఆశ్చర్యపోతున్నారా?

మీరు గమనించారో, లేదో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే ప్రతి మ్యాచ్‌కు ఆ టీమ్ సీఈవో కావ్య మారన్ కచ్చితంగా హాజరవుతుంటారు. కెమెరాలు కూడా ఆమె హావభావాలను ఎక్కువగా చూపిస్తుంటాయి. ఐపీఎల్‌లో తమ జట్టు ఓడిపోయినప్పుడల్లా ఆమె డల్‌గా ఉంటారు. గెలిచినప్పుడు హుషారుగా ఉంటారు. గత కొన్ని సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన పేలవంగా ఉండటంతో కావ్య మారన్ ఎక్కువగా డల్‌గానే కనబడ్డారు. ఈ విషయం మీడియాలో ఎక్కువగా ఫోకస్ కావడంతో సెలబ్రిటీస్ వరకు వెళ్లింది.

జైలర్ సినిమా విజయోత్సవ సభలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ విషయంపై సరదాగా స్పందించారు. సన్‌రైజర్స్ టీమ్‌లో బెస్ట్ ప్లేయర్లను తీసుకుని పెట్టి కావ్య ముఖం వెలిగేలా చేయాలని ఆమె తండ్రి కళానిధి మారన్‌కు ఆయన సలహాయిచ్చారు. “సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మంచి ఆటగాళ్లను పెట్టండి. ఐపీఎల్ సమయంలో టీవీలో కావ్యను అలా చూడటం నాకు బాధగా ఉంద”ని రజనీకాంత్ అనడంతో కావ్యతో సహా అక్కడున్నవారంతా నవ్వేశారు. తాజాగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్దు సాధించడంతో ఈ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది.

Also Read: తండ్రి బ్యాటింగ్‌లో చితకొడుతుందే.. క్లాసెన్ కూతురు ఏం చేసిందంటే.. వీడియో వైరల్

మంచి ప్లేయర్లను పెట్టాలన్న రజనీకాంత్ సలహాతోనే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌ను భారీ మొత్తానికి సన్‌రైజర్స్ కొనుగోలు చేసిందని ఆయన అభిమానులు అంటున్నారు. ఐపీఎల్ వేలంలో పాట్ కమిన్స్‌ను రూ. 20.50 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

 

ట్రెండింగ్ వార్తలు