Ravi Shastri : ర‌విశాస్త్రి పోస్ట్ వైర‌ల్‌.. ఇదేం డ్రెస్ రా బాబు అని అంటున్న నెటిజ‌న్లు..

టీమ్ఇండియా మాజీ కోచ్ ర‌విశాస్త్రి మాత్రం క‌రేబియ‌న్ దీవుల్లో స‌ర‌దాగా గ‌డుపుతున్నాడు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జ‌ట్టు బిజీగా ఉంది. అయితే.. టీమ్ఇండియా మాజీ కోచ్ ర‌విశాస్త్రి మాత్రం క‌రేబియ‌న్ దీవుల్లో స‌ర‌దాగా గ‌డుపుతున్నాడు.. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో కామెంటేట‌ర్‌గా ర‌విశాస్త్రి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాడు. శ‌నివారం ఆంటిగ్వాలోని వివ్ రిచర్డ్స్ స్టేడియంలో భార‌త్‌, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం ర‌విశాస్త్రి ఆంటిగ్వా చేరుకున్నాడు. అయితే.. అత‌డి ల‌గేజీ మాత్రం చేరుకోలేదు.

కాగా.. అత‌డు టిఫిన్ చేస్తున్న ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. ఎందుకంటే అత‌డు బాత్‌రోబ్‌ను ధ‌రించి ఉన్నాడు. ‘అందమైన ఆంటిగ్వాలో ఈ దుస్తులతో అల్పాహారం చేస్తున్నప్పుడు డ్రగ్ లార్డ్ లాగా అనిపిస్తున్నా. నా ల‌గేజీ వేరే ప్రాంతంలో ఉంది. అది త్వ‌ర‌లోనే ఇక్క‌డ‌కు వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను.’ అని ర‌విశాస్త్రి ఫోటో కింద రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.

Virat Kohli : కోహ్లి బ్యాటింగ్ పై కోచ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. విరాట్ ప‌రుగులు చేసినా ఆనందంగా లేదు..

కాగా.. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జ‌ట్టు మ్యాచులు అన్ని న్యూయార్క్, ఫ్లోరిడా వేదిక‌గా జ‌రిగాయి. సూప‌ర్‌-8లో అఫ్గాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌కు బార్బ‌డోస్ వేదిక కాగా.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆంటిగ్వా మైదానంలో జ‌ర‌గ‌నుంది.

ఆంటిగ్వా పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం. బ్యాట‌ర్లు పండుగ చేసుకోవ‌చ్చు. అదే స‌మ‌యంలో బౌల‌ర్ల‌కు మంచి స‌హ‌కారం ల‌భిస్తుంది. లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేస్తే వికెట్లు తీయొచ్చు. అయితే.. బంతి ఏ మాత్రం గ‌తి త‌ప్పినా గానీ బ్యాట‌ర్ల బాదుడికి బ‌లి కావాల్సిందే. ఈ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు ఉంది. అయితే.. మ్యాచ్ పూర్తిగా ర‌ద్దు అయ్యే అవ‌కాశాలు లేవు గానీ.. ఓవ‌ర్ల సంఖ్య త‌గ్గే అవ‌కాశం ఉంది. వ‌ర్షం ప‌డితే పిచ్ నుంచి బౌల‌ర్ల‌కు మ‌రింత స‌హ‌కారం ల‌భించే ఛాన్స్ ఉంటుంది.

Nicholas Pooran : నికోల‌స్ పూర‌న్ సిక్స‌ర్ల సునామీ.. గేల్ పుష్క‌ర కాలం రికార్డు క‌నుమ‌రుగు..

ట్రెండింగ్ వార్తలు