Virat Kohli : కోహ్లి బ్యాటింగ్ పై కోచ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. విరాట్ ప‌రుగులు చేసినా ఆనందంగా లేదు..

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లి ఐపీఎల్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు.

Virat Kohli : కోహ్లి బ్యాటింగ్ పై కోచ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. విరాట్ ప‌రుగులు చేసినా ఆనందంగా లేదు..

Batting Coach Rathour on Kohli Lean Patch in T20 World Cup

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లి ఐపీఎల్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. టోర్నీ టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఇదే ఫామ్‌ను టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో కొన‌సాగిస్తాడ‌ని భావించిన అభిమానుల‌కు నిరాశే ఎదురైంది. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు మ్యాచులు ఆడింది. ఈ నాలుగు మ్యాచుల్లో క‌లిపి విరాట్ కేవ‌లం 29 ప‌రుగులే చేశాడు. మొద‌టి మూడు మ్యాచుల్లో దారుణంగా విఫ‌లం అయిన కోమ్లి.. అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌లో 24 ప‌రుగులు చేయ‌డం గ‌మ‌నార్హం.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు కోహ్లి బ్యాటింగ్ పై టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్ర‌మ్ రాథోడ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అఫ్గానిస్తాన్ పై కోహ్లి ప‌రుగులు చేసిన‌ప్ప‌టికీ కూడా.. దానిని భారీ ఇన్నింగ్స్‌గా మ‌ల‌చ‌క‌పోవ‌డం త‌న‌ను నిరాశ‌కు గురి చేసింద‌న్నాడు. అయితే.. మొద‌టి మూడు మ్యాచుల‌తో పోలిస్తే మెరుగైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించాడ‌న్నారు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పిచ్‌లు స‌వాళ్లు విసురుతున్నాయ‌ని, వీటిపై ఇలా ఆడ‌టం కూడా మంచిదేన‌ని అన్నాడు. ఇక బంగ్లాదేశ్ పై కోహ్లి భారీ ఇన్నింగ్స్ ఆడ‌తాడ‌నే ఆశాభావాన్ని వ్య‌క్తం చేశాడు.

IND vs BAN : భార‌త్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌.. వ‌ర్షం వ‌స్తుందా..? ర‌ద్దైతే ప‌రిస్థితి ఏంటి..?

ఇక తుది జ‌ట్టు గురించి మాట్లాడుతూ.. పిచ్, పరిస్థితుల‌కు అనుగుణంగానే జ‌ట్టు ఎంపిక ఉంటుంద‌న్నాడు. కొన్నిసార్లు తుది జ‌ట్టులో స్పిన్న‌ర్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాల్సి ఉంటుంద‌న్నాడు. ఏదీఏమైన‌ప్ప‌టికీ అత్యుత్త‌మ జ‌ట్టులోనే బ‌రిలోకి దిగుతామ‌ని చెప్పాడు. ఇక అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించ‌డం సానుకూలాంశమ‌న్నాడు. దీంతో మ‌రిన్ని ఆప్ష‌న్లు పెరిగాయ‌న్నాడు.

పంత్ టాప్ ఆర్డ‌ర్‌లో దూకుడుగా ఆడుతున్నాడ‌ని, ఇదే ఆట‌తీరును అత‌డు మిగిలిన మ్యాచుల్లోనూ కొన‌సాగిస్తాడ‌ని చెప్పాడు. అమెరికాలోని న్యూయార్క్‌లో దారుణమైన పిచ్‌లపై ఆడామ‌ని, ఇప్పుడు కరేబియన్‌లో కాస్త మెరుగైన మైదానాల్లో ఆడుతున్న‌ట్లు చెప్పాడు. ఇక బంగ్లాదేశ్‌ను త‌క్కువగా అంచ‌నా వేయ‌డం లేద‌న్నారు.

Nicholas Pooran : నికోల‌స్ పూర‌న్ సిక్స‌ర్ల సునామీ.. గేల్ పుష్క‌ర కాలం రికార్డు క‌నుమ‌రుగు..