Ravichandran Ashwin : అప్పుడు నేను చెప్పిన మాట‌ను ఎవ‌రూ విన‌లేదు.. కానీ.. అశ్విన్‌

తాను చెప్పిన మాట‌ల‌ను ఎవ‌రూ విన‌లేద‌ని టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ ( Ravichandran Ashwin) తెలిపాడు.

Ravichandran Ashwin reveals IPL teams right out denied his suggestion

Ravichandran Ashwin : ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు తాను చెప్పిన మాట‌ల‌ను ఎవ‌రూ విన‌లేద‌ని టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ ( Ravichandran Ashwin) తెలిపాడు. ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర ఆట‌గాడు టిమ్ డేవిడ్‌( Tim David)ను తీసుకోవాల‌ని తాను ఫ్రాంఛైజీల‌కు సూచించిన‌ట్లు వెల్ల‌డించాడు. అయితే.. త‌న సూచ‌న‌ను ఎవ‌రూ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌న్నారు. ఈ విష‌యాన్ని త‌న యూట్యూబ్ ఛానెల్‌లో నిర్వ‌హించే ఓ డిబేట్‌లో అశ్విన్ వెల్ల‌డించాడు.

‘ఈ విష‌యాన్ని ఇప్పుడు ఇలా చెప్ప‌కూడ‌దు కానీ చెబుతున్నాను. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కొన్ని విష‌యాల‌పై నేను సూచ‌న‌ల‌ను ఇచ్చాను. అందులో ముఖ్యంగా టిమ్ డేవిడ్‌ను తీసుకుంటే ఎంతో ప్ర‌యోజ‌నంగా ఉంటుంద‌ని సూచించాను. అయితే.. అప్పుడు అత‌డు పేలవ ఫామ్‌తో ఇబ్బంది ప‌డుతున్నాడని, అత‌డి ప్ర‌ద‌ర్శ‌న మ‌రింత ప‌డిపోతుంద‌ని ప‌లు ఫ్రాంఛైజీలు చెప్పాయి. అత‌డిని తీసుకునేందుకు ముందుకు రాలేదు .’అని అశ్విన్ తెలిపాడు.

Dr Vece Paes : టెన్నిస్ దిగ్గ‌జం లియాండ‌ర్ పేస్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆయ‌న తండ్రి, మాజీ హాకీ ఆట‌గాడు వేస్‌ పేస్ క‌న్నుమూత‌

అయితే.. ఆఖ‌రికి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు డేవిడ్‌ను రూ.3 కోట్ల‌కే సొంతం చేసుకుంద‌న్నాడు. ఇక్క‌డ తాను ఓ విష‌యం చెప్పాల‌ని అనుకుంటున్నాన‌ని అశ్విన్ అన్నాడు. భ‌విష్య‌త్తులో టీ20ల్లో ఎతైన బ్యాట‌ర్ల‌దే హ‌వా అని చెప్పుకొచ్చాడు. వైడ్ లైన్‌లో ఎలాంటి మార్పులు తీసుకురాక‌పోతే అప్పుడు వారిదే రాజ్యం అని అన్నాడు.

ఇక వేలంలో ఆర్‌సీబీ చాలా త‌క్కువ మొత్తానికే డేవిడ్ ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా జ‌ట్టు అత‌డిని బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ముందుకు పంపించ‌డం వ‌చ్చే సీజ‌న్‌లో ఆర్‌సీబీకి క‌లిసి రానుంద‌ని అశ్విన్ తెలిపాడు.

Sanju Samson trade : సంజూ శాంస‌న్‌ను మీకిస్తాం.. అశ్విన్ వ‌ద్దుగానీ.. జ‌డేజాతో పాటు మ‌రోస్టార్ ఆట‌గాడిని ఇవ్వండి.. రాజ‌స్థాన్ డిమాండ్ ?

187 ప‌రుగులు..
ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో టిమ్ డేవిడ్ రాణించాడు. ఈ సీజ‌న్‌లో మొత్తం 101 బంతులు ఎదుర్కొన్న అత‌డు 187 ప‌రుగులు సాధించాడు. ప్ర‌స్తుతం అంత‌ర్జాత‌య క్రికెట్‌లో మంచి ఆట‌తీరు క‌న‌బ‌రుస్తున్నాడు. గ‌త 5 టీ20 మ్యాచ్‌ల్లో 265 ప‌రుగులు చేశాడు.