Ravindra Jadeja becomes first player ever to surpass massive milestone in WTC
Ravindra Jadeja : టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినప్పటికి కూడా జడేజా (Ravindra Jadeja ) ఈ ఘనత అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో జడేజా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి నాలుగు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో అతడు ప్రపంచ టెస్టు ఛాంపియన్స్ షిప్ చరిత్రలో 150 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. అదే సమయంలో డబ్ల్యూటీసీ చరిత్రలో బ్యాటింగ్‌లో రెండు వేలకు పైగా పరుగులు, బౌలింగ్‌లో 150 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
Asia Cup Rising Stars 2025 : పాక్ చేతిలో ఓటమి.. టీమ్ఇండియా సెమీస్‌కు చేరాలంటే..?
డబ్ల్యూటీసీ చరిత్రలో ఇప్పటి వరకు 16 మంది బౌలర్లు మాత్రమే 100 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టారు. బౌలింగ్‌లో 150 కంటే ఎక్కువ వికెట్లు, బ్యాటింగ్‌లో 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు.
డబ్ల్యూటీసీలో 1000 ఫ్లస్ రన్స్‌తో పాటు 150 ప్లస్ వికెట్లు తీసిన ఆటగాళ్లు వీరే..
* రవీంద్ర జడేజా (భారత్) – 150 వికెట్లు, 2550 పరుగులు
* రవిచంద్రన్ అశ్విన్ (భారత్) – 195 వికెట్లు, 1142 పరుగులు
* పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – 215 వికెట్లు, 1020 పరుగులు