×
Ad

Ravindra Jadeja : కెప్టెన్సీ ఇస్తేనే వ‌స్తా.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ర‌వీంద్ర జ‌డేజా కండీష‌న్‌..!

ఆర్ఆర్ కు వెళ్లేందుకు రవీంద్ర జ‌డేజా (Ravindra Jadeja) ఓ కండీష‌న్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

Ravindra Jadeja Makes Special Demand In Trade Deal

Ravindra Jadeja : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 రిటెన్షన్ గడువు దగ్గర పడుతుండటంతో ఆటగాళ్ల ట్రేడ్‌ల గురించి అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. వీటిలో ముఖ్యంగా ర‌వీంద్ర జ‌డేజా, సంజూ శాంస‌న్ ట్రేడ్ డీల్ పైనే అంద‌రి దృష్టి నెల‌కొని ఉంది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య ఈ డీల్ జ‌రుగుతోందని బ‌హుళ నివేదిక‌లు సూచిస్తున్నాయి.

సంజూ శాంస‌న్‌ కోసం ఐదు సార్లు ఛాంపియ‌న్ అయిన చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆల్‌రౌండ‌ర్లు ర‌వీంద్ర జ‌డేజా (Ravindra Jadeja )తో పాటు సామ్ క‌ర‌న్‌ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. ఇందుకు ప్లేయ‌ర్లు కూడా స‌మ్మ‌తి తెలిపిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఆర్ఆర్ కు వెళ్లేందుకు రవీంద్ర జ‌డేజా ఓ కండిష‌న్ పెట్టిన‌ట్లు న్యూస్ 18 క్రికెట్ నెక్ట్స్ తెలిపింది. త‌న‌కు కెప్టెన్సీ ఇస్తేనే జ‌ట్టులోకి వ‌స్తాన‌ని అన్న‌ట్లుగా పేర్కొంది.

IPL trade : ఏమ‌య్యా అశ్విన్ ఇది నీకు త‌గునా? ట్రేడ్ డీల్‌ను లీక్ చేశావుగా..!

ఒక‌టి లేదా రెండు రోజుల్లో ట్రేడింగ్‌కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. ఆ త‌రువాత జ‌డేజా రాజ‌స్థాన్ రాయల్స్ కెప్టెన్ కావ‌డం లాంఛ‌న‌మేన‌ని తెలిపింది.

సంజూశాంస‌న్ గ‌త ద‌శాబ్ద‌కాలంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. అత‌డు 4027 ప‌రుగుల‌తో ఆ జ‌ట్టులో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు. ఐపీఎల్ 2025 సీజ‌న్ ముగిసిన త‌రువాత తాను జ‌ట్టును వీడాల‌ని అనుకుంటున్న‌ట్లు అత‌డు ఆర్ఆర్ మేనేజ్‌మెంట్‌కు తెలియ‌జేసిన‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ఆర్ఆర్ ట్రేడింగ్‌లో అత‌డిని బ‌దిలీ చేసేందుకు సిద్ధ‌మైంది. ఐపీఎల్ 2025 వేలానికి ముందు ఆర్ఆర్ సంజూ శాంస‌న్‌ను రూ.18 కోట్ల‌కు రిటైన్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ర‌వీంద్ర జ‌డేజా 2012లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌లో చేరాడు. అప్ప‌టి నుంచి ఆ జ‌ట్టులో కీల‌క ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు. సీఎస్‌కే పై నిషేదం ప‌డిన రెండు సంవ‌త్స‌రాలు మిన‌హా మిగిలిన అన్ని సీజ‌న్ల‌లో అత‌డు ఆ జ‌ట్టుకే ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎస్‌కే ఐదు ఐపీఎల్ ట్రోఫీల‌ను గెలుచుకోగా.. ఇందులో మూడు టైటిళ్ల‌ను సీఎస్‌కే కైవ‌సం చేసుకోవ‌డంలో త‌న వంతు పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సీఎస్‌కే జ‌డేజాను రూ.18 కోట్ల‌కు రిటైన్ చేసుకుంది.

PAK vs SL: బాబోయ్ మేం ఉండం ఈ పాకిస్తాన్ లో… 8 మంది శ్రీలంక క్రికెటర్లు జంప్! కారణం ఇదే..

2022 సీజ‌న్‌లో జ‌డేజాను చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్‌గా నియ‌మించింది. అయితే.. ఆశించిన ఫ‌లితాలు రాక‌పోవ‌డంతో సీజ‌న్ మ‌ధ్య‌లోనే అత‌డిని నాయక‌త్వ బాధ్య‌త‌ల నుంచి తొల‌గించి ధోనికి అప్ప‌గించింది.

ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం ఏమిటంటే.. ఐపీఎల్ అరంగ్రేట సీజ‌న్ 2008లో జ‌డేజా 19 ఏళ్ల వ‌య‌సులో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఆ సంవ‌త్స‌రం ఆర్ఆర్ టైటిల్ గెలుచుకున్న జ‌ట్టులో జ‌డ్డూ స‌భ్యుడిగా ఉన్నాడు.