Site icon 10TV Telugu

RCB : ఆర్సీబీ ‘కేర్స్‌’ మొద‌లైంది.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు..

RCB announce Rs 25 lakh aid for stampede victims' families

RCB announce Rs 25 lakh aid for stampede victims' families

RCB : 18 ఏళ్ల త‌రువాత రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు ఐపీఎల్ ట్రోఫీని నెగ్గింది. ఈ క్ర‌మంలో ఆట‌గాళ్ల‌ను స‌త్క‌రించేందుకు ఆర్‌సీబీ బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసింది. అయితే.. పెద్ద సంఖ్య‌లో అభిమానులు రావ‌డంతో అక్క‌డ తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 50 మందికి పైగా గాయ‌ప‌డ్డాడు. దీంతో అటు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం, ఇటు ఆర్‌సీబీ (RCB) మేనేజ్‌మెంట్ పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అప్పుడే మృతుల కుటుంబాల‌కు ఆర్‌సీబీ రూ.10ల‌క్ష‌లు, ప్ర‌భుత్వం రూ.10ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక‌సాయాన్ని ప్ర‌క‌టిచిన సంగ‌తి తెలిసిందే.

కాగా.. ఫ్యాన్స్‌కు మ‌ద్ద‌తుగా ఉండేందుకు ఇటీవ‌ల ఆర్‌సీబీ జ‌ట్టు ఆర్‌సీబీ కేర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్ర‌మంలో బాధిత కుటుంబాల‌కు ఆర్థిక సాయాన్ని రూ.25ల‌క్ష‌ల‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది.

World Record : 94 ఫోర్లు, 6 సిక్స‌ర్లు.. 1107 ప‌రుగులు.. దాదాపు100 ఏళ్లుగా చెక్కుచెద‌ర‌ని రికార్డు.. మ‌రో వందేళ్లు అయినా..

‘2025 జూన్ 4న మా హృదయం ముక్క‌లైంది. ఆర్‌సీబీ కుటుంబంలోని 11 మంది స‌భ్యుల‌ను కోల్పోయాము. వారంతా బెంగ‌ళూరు జ‌ట్టు గౌర‌వంలో భాగం. వారు మ‌నమ‌ధ్య‌లో లేక‌పోవ‌డం ఎంతో బాధాక‌రం. వారి జ్ఞాప‌కాలు ఎప్ప‌టికి గుర్తిండిపోతాయి. వారి కుటుంబాల‌కు ఎంత డ‌బ్బు ఇచ్చినా వారు లేని లోటు పూడ్చ‌లేనిది. అయితే.. వారి కుటుంబాల‌కు ఆర్థికంగా కాస్త మ‌ద్ధ‌తుగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాం. అందుక‌నే బాధిత కుటుంబాల‌కు రూ.25ల‌క్ష‌ల చొప్పున అంద‌జేస్తాము. ఆర్థిక సాయ‌మే కాదు వారి కుటుంబాల‌కు ఎలాంటి అవ‌స‌ర‌మొచ్చినా మ‌ద్ద‌తుగా ఉంటాం. ఇది ఆర్‌సీబీ కేర్స్ ఆరంభం. అభిమానుల ఆకాంక్ష మేర‌న‌కు ప్ర‌తి అడుగు వేస్తాం.’ అని ఆర్‌సీబీ తెలిపింది.

Exit mobile version