Jadeja : జ‌డేజా కీల‌క వ్యాఖ్య‌లు.. ఆర్‌సీబీ ఇంకా ఐసీయూలోనే ఉంది

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ప్లేఆఫ్స్ రేసులో నిల‌వాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన స్థితిలో ఉన్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అద‌ర‌గొడుతోంది.

Ajay Jadeja : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ప్లేఆఫ్స్ రేసులో నిల‌వాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన స్థితిలో ఉన్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అద‌ర‌గొడుతోంది. వ‌రుస‌గా మూడో మ్యాచ్‌లోనూ గెలుపొందింది. శ‌నివారం చిన్న‌స్వామి వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలో పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగ‌బాకింది. విజ‌యాలు సాధించ‌డ‌మే కాదు త‌న నెట్‌ర‌న్‌రేట్‌ను మెరుగుప‌ర‌చుకుంటోంది.

ఆర్‌సీబీ వ‌రుస విజ‌యాల పై టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు అజ‌య్ జ‌డేజా స్పందించాడు. ఆర్‌సీబీ వెంటిలేట‌ర్ నుంచి బ‌య‌ట‌ప‌డింది. కానీ ఇంకా ఐసీయూలోనే ఉంది అని అన్నాడు. గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో కోహ్లి, డుప్లెసిస్ బ్యాటింగ్‌ను ఎంతో ఆస్వాదించిన‌ట్లు చెప్పుకొచ్చాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలర్ల పాత్ర ఎంతో ఉంద‌న్నాడు. బౌల‌ర్లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశార‌న్నాడు. ఆర్‌సీబీ బౌలింగ్ క‌థ ఇప్పుడే మొద‌లైంది. గెల‌వాలంటే వాళ్లు ఇలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌లే పున‌రావృతం చేయాలి జడేజా తెలిపాడు.

Women’s T20 World Cup 2024 : మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ షెడ్యూల్ విడుద‌ల‌..

ప్ర‌స్తుతం బెంగ‌ళూరు జ‌ట్టు స‌రైన మార్గంలోనే ప‌య‌నిస్తుంద‌న్నాడు. అదే స‌మ‌యంలో గుజ‌రాత్ టైటాన్స్ దారి త‌ప్పింద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. అయితే.. ఎవ‌రు గ‌మ్యాన్ని చేరుకుంటార‌నే ఇప్పుడే చెప్ప‌డం చాలా క‌ష్ట‌మ‌ని జ‌డేజా అన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు గుజ‌రాత్, బెంగ‌ళూరు చెరో 11 మ్యాచులు ఆడాయి. రెండు జ‌ట్లు చెరో నాలుగు మ్యాచుల్లో గెలిచి 8 పాయింట్లు సొంతం చేసుకున్నాయి. నెట్‌ర‌న్‌రేట్ కాస్త మెరుగ్గా ఉండ‌డంతో ఆర్‌సీబీ ఏడో స్థానంలో ఉండ‌గా గుజ‌రాత్ తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతోంది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు మొదట బ్యాటింగ్ చేసింది. 19.3 ఓవ‌ర్ల‌లో 147 ప‌రుగుల‌కు ఆలౌటైంది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో షారుఖ్ ఖాన్ (37), డేవిడ్ మిల్ల‌ర్ (30), రాహుల్ తెవాటియా (35) లు ఫ‌ర్వాలేద‌నిపించారు. అనంత‌రం ల‌క్ష్యాన్ని ఆర్‌సీబీ 13.4 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్‌సీబీ బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్లు ఫాప్ డుప్లెసిస్ (64; 23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), విరాట్ కోహ్లి (42; 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.

Dinesh Karthik : కాఫీ కూడా తాగ‌నివ్వ‌లేదురా అయ్యా.. ఆర్‌సీబీ వికెట్ల ప‌త‌నం పై దినేశ్ కార్తీక్‌

ట్రెండింగ్ వార్తలు