Virat Kohli on Bengaluru stampade : బెంగళూరు తొక్కిసలాటపై తొలిసారి స్పందించిన కోహ్లీ.. ‘సంతోషం.. క్ష‌ణాల్లో విషాద‌మైంది’

ఇన్నాళ్లుగా ఈ ఘ‌ట‌న‌(Virat Kohli on Bengaluru stampade )పై మౌనంగా ఉన్న స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ ఎట్ట‌కేల‌కు స్పందించాడు.

RCB share Virat Kohli first reaction to Bengaluru stampede

Virat Kohli on Bengaluru stampade : ఐపీఎల్‌లో ఎన్నాళ్లుగానో అంద‌ని ద్రాక్ష‌లా ఊరిస్తూ వ‌స్తున్న క‌ప్పును ఈ ఏడాది ముద్దాడింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు. 17 ఏళ్ల త‌రువాత ఐపీఎల్ ట్రోఫీ సొంతం కావ‌డంతో అభిమానుల‌తో పాటు ఆ ఫ్రాంచైజీ, ఆట‌గాళ్ల ఆనందానికి అంతే లేకుండా పోయింది. అయితే.. ఆ ఆనందం ఎన్నో గంట‌లు కూడా లేకుండా పోయిన సంగ‌తి తెలిసిందే.

టైటిల్ గెలిచిన మ‌రుస‌టి రోజు అంటే.. జూన్ 4న విజ‌యోత్స‌వ ర్యాలీని నిర్వ‌హించ‌గా చిన్న‌స్వామి స్టేడియం వ‌ద్ద తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. కాగా.. ఇన్నాళ్లుగా ఈ ఘ‌ట‌న‌పై మౌనంగా ఉన్న స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ ఎట్ట‌కేల‌కు స్పందించాడు (Virat Kohli on Bengaluru stampade).

Kieron Pollard : కీర‌న్ పొలార్డ్ అరుదైన ఘ‌న‌త‌.. ఎలైట్ జాబితాలో చోటు.. షిమ్రాన్ హిట్‌మ‌య‌ర్‌ను వెన‌క్కినెట్టి..

‘జూన్‌ 4న హృదయ విదారక ఘటన జరిగింది. జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఆ రోజు మా ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత ఆనందకరమైన క్షణంగా ఉండాల్సింది.. కానీ విషాదంగా మారింది. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. గాయాలపాలైన వారు పూర్తిగా కోలుకోవాలని దేవుడిని వేడుకుంటున్నాను. వారి బాధ మా కథలో భాగమైంది. ఇకపై జాగ్రత్తగా, గౌరవంతో, బాధ్యతతో ముందుకు సాగుతాం.’ అని విరాట్ కోహ్లీ తెలిపిన‌ట్లు ఆర్‌సీబీ త‌మ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.