WPL 2024 : డ‌బ్ల్యూపీఎల్‌లో విషాదం.. మ్యాచ్ జ‌రుగుతుండ‌గానే.. ప్రముఖ స్పోర్ట్స్ కెమెరామెన్ తిరువల్లువన్ కన్నుమూత

ప్రముఖ స్పోర్ట్స్ కెమెరామెన్ తిరువల్లువన్ కన్నుమూత

Thiruvalluvan – WPL 2024 : జీవితం ఎప్పుడు ఎలా ముగిస్తుందో ఎవ్వ‌రు చెప్ప‌లేరు. నిన్న‌టి వ‌ర‌కు మ‌న‌తోటి, మ‌న ప‌క్క‌న ఉన్న వ్య‌క్తి నేడు మ‌న మ‌ధ్య ఉండ‌క‌పోవ‌చ్చు. జీవితం చాలా చిన్న‌ది కాబ‌ట్టి ఉన్న స‌మ‌యంలో ఆనందంగా ఉండాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు. తాజాగా ఓ విషాదక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌ముఖ కెమెరామెన్ క‌మ‌ల‌నాడి ముత్తు తిరువ‌ల్లువ‌న్ అలియాస్ తిరు మ‌ర‌ణించాడు.

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్ ) రెండో సీజ‌న్ ఎంతో ఘ‌నంగా ఆరంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో శుక్ర‌వారం రాత్రి జ‌రిగిన ఈ మ్యాచ్‌ను కెమెరామెన్ ముత్తు క‌వ‌ర్ చేశారు. అయితే.. శ‌నివారానికి ఆయ‌న మ‌న మ‌ధ్య‌లో లేడు. ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు క్రికెట‌ర్ల‌తో పాటు ప్ర‌ముఖ వ్యాఖ్య‌త హ‌ర్షాబోగ్లే సంతాపం తెలియ‌జేశారు. అత‌డి మృతికి సంతాపంగా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య రాంచీ వేదిక‌గా జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో కెమెరామెన్‌లు చేతికి న‌ల్ల‌రిబ్బ‌న్లు క‌ట్టుకున్నారు.

Sunil Gavaskar : టీమ్ఇండియాకు మ‌రో ధోనీ దొరికాడు

కమలనాడిముత్తు తిరువల్లువన్ ఎవరు?

కమలనాడిముత్తు తిరువల్లువన్ ఒక సీనియర్ స్పోర్ట్స్ కెమెరామెన్. తిరుగా ప్రసిద్ధి చెందాడు. భార‌త దేశంలో క్రికెట్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలు ప్రారంభ‌మైన‌ప్ప‌టికి నుంచి ఉన్నాడు. త‌న కెమెరా నైపుణ్యంతో మ్యాచ్‌ల‌ను చ‌క్క‌గా చూపించేవాడు. అదే అత‌డిని మిగిలిన వారితో పోలిస్తే అత్యుత్త‌మంగా నిల‌బెట్టింది.

మ‌ర‌ణానికి కార‌ణం ఏంటీ..?

డ‌బ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్‌ను క‌వ‌ర్ చేస్తూ.. తిరు ఆకస్మాత్తుగా కుప్ప‌కూలాడు. గ‌మ‌నించిన స‌హ‌చ‌రుల‌తో పాటు అక్క‌డి సిబ్బంది వెంట‌నే అత‌డికి వైద్య సాయం అందించారు. అత‌డిని బ్ర‌తికించ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌లం అయ్యాయి. అత‌డి ఆక‌స్మిక మృతితో స‌హోద్యోగులు, స్నేహితులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యారు. కాగా.. అత‌డి మ‌ర‌ణానికి ఖ‌చ్చిత‌మైన కార‌ణం తెలియ‌రాలేదు.

Ravichandran Ashwin : చ‌రిత్ర సృష్టించిన ర‌విచంద్ర‌న్ అశ్విన్‌.. స్వ‌దేశంలో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా..

ట్రెండింగ్ వార్తలు