Ravichandran Ashwin : చరిత్ర సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్.. స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా..
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు.

Ravichandran Ashwin
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. రాంచీలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచులో అశ్విన్ ఈ ఘనతలను అందుకున్నాడు. వరుస బంతుల్లో బెన్ డకెట్, ఓలీపోప్‌లను ఔట్ చేయడం ద్వారా స్వదేశంలో అశ్విన్ తీసిన వికెట్ల సంఖ్య 351కి చేరింది.
Another day, another landmark! ? ?
With that Ben Duckett wicket, R Ashwin completed 3⃣5⃣0⃣ Test wickets in India ? ?
Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9 #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/2hHY2Ohq7p
— BCCI (@BCCI) February 25, 2024
భారత్‌లో అత్యధిక వికెట్లు తీసిన టీమ్ఇండియా ఆటగాళ్లు వీరే..
రవిచంద్రన్ అశ్విన్ – 351*
అనిల్ కుంబ్లే – 350 వికెట్లు
హర్భజన్ సింగ్ – 265
కపిల్ దేవ్ – 219
రవీంద్ర జడేజా – 210*
బిఎస్ చంద్రశేఖర్ – 142
బిషన్ సింగ్ బేడీ – 137
జహీర్ ఖాన్ – 104
ఇషాంత్ శర్మ – 104
R Ashwin ??? #INDvENG pic.twitter.com/7ywntggMY9
— Cricbuzz (@cricbuzz) February 25, 2024
ఇక ఓవరాల్‌గా తీసుకుంటే.. స్వదేశంలో 350 కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ ఐదో స్థానంలో నిలిచాడు. ముత్తయ్య మురళీధరన్, జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, కుంబ్లే తర్వాత అశ్విన్ ఈ ఘనత సాధించాడు.
Dhruv Jurel : ధ్రువ్ జురెల్ సెంచరీ మిస్.. ఇంగ్లాండ్‌కు స్వల్ప ఆధిక్యం
స్వదేశంలో 350 లేదా అంతకంటే ఎక్కువ టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్లు..
ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) – 73 టెస్టుల్లో 493 వికెట్లు
జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్) – 105 టెస్టుల్లో 434 వికెట్లు
స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్) – 98 టెస్టుల్లో 398 వికెట్లు
రవిచంద్రన్ అశ్విన్ (భారత్)- 59 టెస్టుల్లో 351 వికెట్లు
అనిల్ కుంబ్లే (భారత్) – 63 టెస్టుల్లో 350 వికెట్లు