Report Card Of India A Stars Karun Nair Hit Shardul Thakur Flop
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌కు సన్నాహకంగా భారత్ ఏ జట్టు ఇంగ్లాండ్ లయన్స్‌తో రెండు అనధికార టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఈ రెండు మ్యాచ్‌లు కూడా ఎలాంటి ఫలితం లేకుండా డ్రాగానే ముగిశాయి. ఈ మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన టీమ్ఇండియా ఆటగాళ్లలో కొందరు తమ ప్రతిభ చూపించారు. ఇంకొందరు నిరాశ పరిచారు.
బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌లు రాణించారు. అయితే.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం విఫలం అయ్యాడు. ఇక బౌలింగ్ విభాగంలో శార్దూల్ ఠాకూర్, నితీశ్ రెడ్డిలు ఆకట్టుకోలేకపోయారు. అన్షుల్ కాంబోజ్ మాత్రం మంచి ప్రభావం చూపించాడు.
అన్షుల్ కాంబోజ్ : ఈ సిరీస్‌లో భారత్ తరుపున రాణించిన బౌలర్లలో ఇతడు ఒకడు. రెండు మ్యాచ్‌లలో అతను అత్యంత క్రమశిక్షణ కలిగిన బౌలర్. ఓవర్‌కు 3.04 ఎకానమీతో పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్‌లోనూ రాణించి ఓ హాఫ్ సెంచరీ చేశాడు.
MS Dhoni : ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ధోని.. మిస్టర్ కూల్ స్పందన ఇదే..
ఖలీల్ అహ్మద్ : ఈ ఎడమచేతి వాటం పేసర్ సిరీస్‌లో ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. తన బౌలింగ్‌తో ఇంగ్లీష్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. నాలుగు వికెట్లు సాధించాడు.
కేఎల్ రాహుల్ : ఈ సిరీస్‌లో అత్యంత ఆకట్టుకున్న బ్యాటర్లలో కేఎల్ రాహుల్ ఒకడు. ఒకే మ్యాచ్ ఆడాడు. రెండు ఇన్నింగ్స్‌లలో 167 పరుగులు చేశాడు.
కరుణ్ నాయర్ : టీమ్ఇండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు కరుణ్ నాయర్. తొలి మ్యాచ్‌లో ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు. మొత్తంగా 259 పరుగులు సాధించాడు.
ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ : ధ్రువ్ జురెల్ సిరీస్‌లో మూడు అర్ధ సెంచరీల సాయంతో మొత్తంగా 227 పరుగులు చేశాడు. అటు ఒకే ఒక్క సారి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ 92 పరుగులతో రాణించాడు.
విఫలమైంది వీళ్లే..
ఎన్నో అంచనాలు పెట్టుకున్న శార్దూల్ ఠాకూర్ అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో విఫలం అయ్యాడు. బ్యాటింగ్‌లో కేవలం 80 పరుగులే చేయగా, బౌలింగ్‌లో రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. రెండు మ్యాచ్‌ల్లో కలిపి 110 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది.
RCB : అమ్మకానికి ఆర్‌సీబీ?.. ఐపీఎల్ విజేతగా నిలవగానే.. షాక్‌లో ఫ్యాన్స్? కొత్త యజమాని..
ఇండియా-ఏ కు కెప్టెన్‌గా వ్యవహరించిన అభిమన్యు ఈశ్వరన్ 4 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 167 పరుగులు మాత్రమే చేశాడు. నితీశ్ రెడ్డి 4 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్‌లో కేవలం 135 పరుగులు మాత్రమే చేయగా బౌలింగ్‌లోరెండు వికెట్లు మాత్రమే తీశాడు.