RCB : అమ్మ‌కానికి ఆర్‌సీబీ?.. ఐపీఎల్ విజేత‌గా నిల‌వ‌గానే.. షాక్‌లో ఫ్యాన్స్‌? కొత్త య‌జ‌మాని..

ఐపీఎల్‌లో అత్యంత ప్ర‌జాదార‌ణ ఉన్న జ‌ట్ల‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఒక‌టి.

RCB : అమ్మ‌కానికి ఆర్‌సీబీ?.. ఐపీఎల్ విజేత‌గా నిల‌వ‌గానే.. షాక్‌లో ఫ్యాన్స్‌?  కొత్త య‌జ‌మాని..

Royal Challengers Bengaluru Owners Looking Sell Franchise After IPL 2025 Win

Updated On : June 10, 2025 / 1:53 PM IST

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో అత్యంత ప్ర‌జాదార‌ణ ఉన్న జ‌ట్ల‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(ఆర్‌సీబీ) ఒక‌టి. త‌మ సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ ఈ ఏడాది ఐపీఎల్ విజేత‌గా నిలిచింది ఆర్‌సీబీ. ఐపీఎల్ ట్రోఫీని తొలిసారి ఆర్‌సీబీ ముద్దాడ‌డంతో ఆ జ‌ట్టు ఆట‌గాళ్లు, అభిమానుల ఆనందానికి హద్లులు లేకుండా పోయాయి. అయితే.. ఆర్‌సీబీ ఫ్రాంచైజీని విక్ర‌యించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఫ్రాంచైజీని ప్రస్తుత యాజ‌మాన్యం డియాజియో.. జట్టును పూర్తిగా లేదా కొంత భాగాన్ని విక్రయించే అవకాశాలను పరిశీలిస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఫ్రాంచైజీ విలువ పై ఇంకా అధికారిక స‌మాచారం లేన‌ప్ప‌టికి, 2 బిలియ‌న్ డాల‌ర్లు (సుమారు రూ.16,384 కోట్లు) వ‌ర‌కు డిమాండ్ చేయ‌వ‌చ్చున‌ని బ్లూమ్ బెర్గ్ నివేదించింది.

Venkatesh Iyer : న‌క్క‌తోక తొక్కిన వెంక‌టేశ్ అయ్య‌ర్‌.. ఐపీఎల్‌లో అట్ట‌ర్ ప్లాప్‌.. అయినా గానీ కెప్టెన్సీ..

బ్రిటిష్ డిస్టిలర్, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ యొక్క మాతృ సంస్థ అయిన‌ డియాజియో పిఎల్‌సి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో పాక్షిక లేదా పూర్తి వాటాను విక్రయించడానికి సంబంధింత వ్య‌క్తుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. ఆర్‌సిబి అమ్మకానికి అవకాశం ఉందనే వార్తలు వెలువడటంతో.. యునైటెడ్ స్పిరిట్స్ షేర్లకు కూడా సెంటిమెంట్లు ఊతమిచ్చాయి. మంగళవారం ఉదయం స్టాక్ ధరలు 3.3% వరకు పెరిగాయి.

అయితే ఫ్రాంచైజీని విక్రయించాలా వద్దా అనే దానిపై ఇంకా తుది నిర్ణ‌యం తీసుకులేద‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇక దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

Luckiest Batter : వ‌ర‌ల్డ్‌లోనే ల‌క్కీయెస్ట్ బ్యాట‌ర్ ఇత‌డే.. 98 పరుగుల వ‌ద్ద ఉండ‌గా..

డియాజియో RCBని ఎలా కొనుగోలు చేసింది?

ఐపీఎల్ 2008లో ప్రారంభ‌మైంది. అప్పుడు ఆర్‌సీబీ జ‌ట్టును కింగ్ ఫిష‌ర్ ఎయిర్ లైన్స్ య‌జ‌మాని విజ‌య్ మాల్యా సొంతం చేసుకున్నాడు. అయితే.. ఆయ‌న 2012లో అప్పుల ఊబిలో చిక్కుకున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డి సామ్రాజ్యం కూలిపోయింది. ఈ స‌మ‌యంలో విజ‌య్ మాల్యా స్పిరిట్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేయ‌డం ద్వారా ఆర్‌సీబీని డియోజియో సొంతం చేసుకుంది.