Luckiest Batter : వరల్డ్‌లోనే లక్కీయెస్ట్ బ్యాటర్ ఇతడే.. 98 పరుగుల వద్ద ఉండగా..
బౌలర్ వేసిన బంతి వికెట్లను తాకింది. అయితే.. సదరు బ్యాటర్ అదృష్టం మామూలుగా లేదు.

The luckiest batter in the world while batting on 98
క్రికెట్‌లో అప్పుడప్పుడు కొన్ని సరదా ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొన్ని సంఘటనలను చూస్తే మన కళ్లను మనమే నమ్మలేం. అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ బ్యాటర్ 98 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా.. బౌలర్ వేసిన బంతి వికెట్లను తాకింది. అయితే.. సదరు బ్యాటర్ అదృష్టం మామూలుగా లేదు. బెయిల్స్ పడకపోవడంతో సదరు బ్యాటర్ ఔట్ కాలేదు. ఈ ఘటన గతేడాది డిసెంబర్‌లో జరుగగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో మరోసారి వైరల్ అవుతోంది.
గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన బిగ్ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. UP బ్రిజ్ స్టార్స్, MP టైగర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్ నాయకత్వంలోని ఎంపీ టైగర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. సాకేత్ శర్మ (52 బంతుల్లో 101), పవన్ నేగి (38 బంతుల్లో 87 నాటౌట్) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది.
Prithvi Shaw : అరెరె.. ఐపీఎల్ అయిపోయినాక తుఫాన్ ఇన్నింగ్స్.. ఓ రెండు నెలల ముందు ఇలా ఆడుంటే..
అనంతరం UP బ్రిజ్ స్టార్స్ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది. మిగిలిన వారు పెద్దగా రాణించపోయినా చిరాగ్ గాంధీ మాత్రం ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతడు తన వ్యక్తిగత స్కోరు 98 పరుగుల వద్ద ఉండగా.. పవన్ నేగి బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే.. బంతి అతడి బ్యాట్‌ను మిస్సై వికెట్లు చాలా బలంగానే తాకింది.
The luckiest batter in the world while batting on 98*. 😄pic.twitter.com/iTvu6JwCqs
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2025
అయితే.. ఇక్కడ గాంధీ అదృష్టం మామూలుగా లేదు. బెయిల్స్ కిందపడలేదు. దీంతో గాంధీ ఔట్ కాలేదు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతడు సెంచరీ చేశాడు. మొత్తంగా 58 బంతులు ఎదుర్కొన్న అతడు 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. గాంధీ సెంచరీ చేసినా మిగిలిన వారు విఫలం కావడంతో యూపీ లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులకే పరిమితమైంది. దీంతో 71 పరుగుల తేడాతో ఎంపీ గెలుపొందింది.
Team India : బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమ్ఇండియా హోం సీజన్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు..
ఈ వీడియో వైరల్‌గా మారగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.