Prithvi Shaw : అరెరె.. ఐపీఎల్ అయిపోయినాక తుఫాన్ ఇన్నింగ్స్.. ఓ రెండు నెలల ముందు ఇలా ఆడుంటే..
గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న పృథ్వీ షా ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు.

Prithvi Shaw Slams Quick Half-Century In T20 Mumbai League
టీమ్ఇండియా క్రికెటర్ పృథ్వీ షా గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అపారమైన టాలెంట్ ఉన్నప్పటికి కూడా నిర్లక్ష్యం కారణంగా తన కెరీర్‌ను చేజేతులా పాడు చేసుకుంటున్నాడు. టీమ్ఇండియాలో ఎప్పుడో చోటు కోల్పోయిన ఈ కుర్రాడు.. ఓవర్ వెయిట్ కారణంగా ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటూ తన దేశవాలీ జట్టు ముంబైలో కూడా స్థానాన్ని నిలుపుకోలేకపోయాడు. ఇక ఐపీఎల్ 2025 సీజన్‌లో ఒక్క ఫ్రాంచైజీ కూడా ఈ ఆటగాడిని కొనుగోలు చేయడానికి కూడా ముందుకు రాలేదు అంటే అతడి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న ఈ ఆటగాడు ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. ముంబై టీ20 లీగ్‌లో నార్త్ ముంబై పాంథర్స్ తరుపున చెలరేగి ఆడాడు. ఆదివారం ట్రయంప్ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 34 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేశాడు.
Team India : బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమ్ఇండియా హోం సీజన్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు..
పృథ్వీ షాతో పాటు హర్షల్ జాదవ్ (30 బంతుల్లో 46 పరుగులు) రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన పాంథర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. నైట్స్ బౌలర్లలో శ్రేయస్ గౌరవ్ రెండు వికెట్లు తీశాడు. మినాద్ మంజ్రేకర్, పరిక్షిత్, సుర్యాంశ్ షేడ్గే తలా ఓ వికెట్ సాధించారు.
ఆ తరువాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నైట్స్ 19.5 ఓవర్లలో 169 పరుగులకే కుప్పకూలింది. పాంథర్స్ బౌలర్లలో ప్రతిక్ మిశ్రా నాలుగు వికెట్లు తీయగా, రాహుల్ సావంత్ రెండు, ముజమ్మిల్ ఖాద్రి, గౌరవ్ జాథర్ తలా ఓ వికెట్ తీశారు.
తాజా ఇన్నింగ్స్ ప్రదర్శన ద్వారా షా తిరిగి ముంబై జట్టులో చోటు సంపాదించుకోవాలని ఆశిస్తున్నాడు.