Ravichandran Ashwin : నేను ఔట్ కాదు.. మీ నిర్ణయం మార్చుకోండి.. మహిళా అంపైర్‌తో అశ్విన్ వాగ్వాదం.. వీడియో వైరల్..
టీమ్ఇండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌కు పట్టరాని కోపం వచ్చింది.

TNPL 2025 Ashwin fumes at umpire for giving him out lbw despite
టీమ్ఇండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌కు పట్టరాని కోపం వచ్చింది. ఫీల్డ్ అంపైర్ చేసిన ఘోర తప్పిదం కారణంగా అతడు సహనం కోల్పోయాడు. ఈ క్రమంలో మహిళా అంపైర్ పై మండిపడ్డాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్) 2025 సీజన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ లీగ్‌లో రవిచంద్రన్ అశ్విన్ దిండిగల్ డ్రాగన్స్ కు సారథ్యం వహిస్తున్నాడు. లీగ్‌లో భాగంగా ఆదివారం (జూన్ 8న) దిండిగల్ డ్రాగన్స్, ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిజాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో దిండిగల్ డ్రాగన్స్ ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
గుడ్ బై RR.. ఛలో CSK..! చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి సంజు శాంసన్..?
ఈ ఓవర్‌ను తమిజాన్స్ బౌలర్ సాయి కిషోర్ వేశాడు. ఈ ఓవర్‌లోని ఆఖరి బంతిని అశ్విన్ స్వీప్ షాట్ ఆడబోయి విఫలం అయ్యాడు. దీంతో బంతి అతడి ప్యాడ్లను తాకింది. వెంటనే బౌలర్ అప్పీల్ చేయగా.. ఆన్‌ఫీల్డ్ మహిళా అంపైర్ ఔట్ ఇచ్చింది. మహిళా అంపైర్ ఇచ్చిన నిర్ణయం పై అశ్విన్ నిరాశ చెందాడు. బంతి ఔట్ సైడ్ లెగ్‌లో పిచ్ అయింద్యని, తాను నాటౌట్ అంటూ సదరు అంపైర్‌తో వాదించాడు.
Ash அண்ணா Not Happy அண்ணாச்சி! 😶🌫
📺 தொடர்ந்து காணுங்கள் | TNPL 2025 | iDream Tiruppur Tamizhans vs Dindigul Dragons | Star Sports தமிழில் #TNPLOnJioStar #TNPL #TNPL2025 pic.twitter.com/Csc2ldnRS3
— Star Sports Tamil (@StarSportsTamil) June 8, 2025
అయితే.. అశ్విన్ మాటలను సదరు అంపైర్ పట్టించుకోలేదు. దీంతో చేసేది లేక అతడు కోపంతో బ్యాట్‌ను తన ప్యాడ్‌కు కొట్టుకుంటూ పెవిలియన్‌కు వెళ్లాడు. టీవీ రిప్లేలో బంతి ఔట్ సైడ్ లెగ్ పిచ్ అయినట్లుగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా.. కొందరు అశ్విన్‌ను సపోర్టు చేయగా, మరికొందరు మహిళా అంపైర్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన అశ్విన్ 11 బంతులను ఎదుర్కొన్నాడు. రెండు ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 18 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో అశ్విన్ జట్టు 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో దిండిగుల్ జట్టు 16.2 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిజాన్స్11.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. బౌలింగ్‌లోనూ అశ్విన్ పెద్దగా ఆకట్టుకోలేదు. 2 ఓవర్లు వేసి 28 పరుగులు ఇచ్చాడు.