Venkatesh Iyer : న‌క్క‌తోక తొక్కిన వెంక‌టేశ్ అయ్య‌ర్‌.. ఐపీఎల్‌లో అట్ట‌ర్ ప్లాప్‌.. అయినా గానీ కెప్టెన్సీ..

టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ వెంక‌టేశ్ అయ్య‌ర్‌ అదృష్టం మామూలుగా లేదు.

Venkatesh Iyer : న‌క్క‌తోక తొక్కిన వెంక‌టేశ్ అయ్య‌ర్‌.. ఐపీఎల్‌లో అట్ట‌ర్ ప్లాప్‌.. అయినా గానీ కెప్టెన్సీ..

MPL 2025 Pink Panthers Captain is Venkatesh Iyer

Updated On : June 10, 2025 / 12:51 PM IST

టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ వెంక‌టేశ్ అయ్య‌ర్‌ అదృష్టం మామూలుగా లేదు. ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో రూ.23.75 కోట్ల‌కు అమ్ముడుపోయాడు. అయితే.. ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌లం అయ్యాడు. 11 మ్యాచ్‌లు ఆడాడు. 7 ఇన్నింగ్స్‌ల్లో 142 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో మిగిలిన మ్యాచ్‌ల్లో అత‌డు బెంచీకే ప‌రిమితం అయ్యాడు. అయినా కానీ తాజాగా మ‌రోసారి అదృష్టం అత‌డి త‌లుపుత‌ట్టింది. ఓ జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

మధ్యప్రదేశ్‌ లీగ్‌(ఎంపీఎల్‌) రెండో ఎడిష‌న్‌కు అంతా సిద్ధ‌మైంది. జూన్ 12 నుంచి ఎంపీఎల్ రెండో ఎడిష‌న్ ప్రారంభం కానుంది. తొలి ఎడిష‌న్‌లో 5 జ‌ట్లు మాత్ర‌మే ఈ లీగ్‌లో పోటీప‌డ‌గా, తాజాగా మ‌రో రెండు కొత్త ఫ్రాంఛైజీలు చంబ‌ల్ ఘ‌రియ‌ల్స్‌, ఇండోర్ పింక్ పాంథ‌ర్స్ లు కొత్త‌గా వ‌చ్చాయి.

Rishabh Pant: పంత్ కొడితే అట్లుంటది మరి.. పగిలిపోయిన స్టేడియం పైకప్పు.. వీడియో వైరల్..

వీటిలో ఇండోర్ పింక్ పాంథ‌ర్స్ జ‌ట్టుకు వెంక‌టేశ్ అయ్య‌ర్ నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. గ‌త సీజ‌న్‌లో గ్వాలియర్ చీతాస్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు.

ఎంపీఎల్ తొలి సీజ‌న్‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్ 8 మ్యాచ్‌ల‌లో 58.57 స‌గ‌టుతో 480 ప‌రుగులు చేశాడు. ఇక కొత్త పాత్ర‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్ ఎలా ఆడ‌తాడో చూడాల్సిందే.