Rishabh Pant: పంత్ కొడితే అట్లుంటది మరి.. పగిలిపోయిన స్టేడియం పైకప్పు.. వీడియో వైరల్..

ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు ముందు నెట్స్ లో రిషబ్ పంత్ సిక్సుల మోత మోగించాడు. ఈ క్రమంలో స్టేడియం పైకప్పు పగిలిపోయింది.

Rishabh Pant: పంత్ కొడితే అట్లుంటది మరి.. పగిలిపోయిన స్టేడియం పైకప్పు.. వీడియో వైరల్..

Rishabh Pant

Updated On : June 10, 2025 / 10:59 AM IST

Rishabh Pant: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈనెల 20 నుంచి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్ జట్టు ప్లేయర్లు ఇంగ్లాండ్ చేరుకున్నారు. ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ భారీ షాట్లు ఆడటం ద్వారా తన అద్భుతమైన ప్రదర్శనను కనబర్చాడు.

ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టాడు. ఆ బంతి నేరుగావెళ్లి స్టేడియం పైకప్పు పై పడింది. దీంతో స్టేడియం పైకప్పు కొంతభాగం పగిలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ప్రాక్టీస్ సేషన్‌లో తొలిరోజు బ్యాటింగ్ చేస్తుండగా పంత్ చేతికి గాయమైంది. దీంతో అతను ప్రాక్టీస్ సెషన్ నుంచి వెళ్లిపోయాడు. పంత్‌కు బలమైన గాయమైనట్లు వార్తలు వచ్చాయి. కానీ, పంత్ గాయం నుంచి కోలుకొని మళ్లీ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటున్నాడు.


ఇటీవల జరిగిన ఐపీఎల్-2025లో పంత్ పేలవ ప్రదర్శనను కనబర్చాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ గా 13 మ్యాచ్ లలో 24.45 సగటుతో కేవలం 269 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం ప్రాక్టీస్ సెషన్ లో పంత్ భారీ షాట్లు ఆడుతూ కనిపించాడు. పంత్ ఫామ్ లోకి వస్తే ఇంగ్లాండ్ బౌలర్లకు ఇబ్బందికరమేనని మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. గతంలో ఇంగ్లాండ్‌లో ఆడిన టెస్టు మ్యాచ్‌లలో పంత్‌కు మంచి రికార్డు ఉంది.

ఇంగ్లాండ్‍లో 17 ఇన్నింగ్స్‌లలో 32.70 సగటుతో రిషబ్ పంత్ 556 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. 2022లో ఇంగ్లాండ్‌లో టీమిండియా ఆడిన చివరి టెస్ట్‌లో పంత్ సెంచరీ చేశాడు. 146 (111 బంతుల్లో) ఇన్నింగ్స్ ఆడి 98/5 స్థితిలో ఓటమి అంచుల్లో ఉన్న భారత జట్టును సురక్షిత స్థితికి చేర్చాడు.