MPL 2025 Pink Panthers Captain is Venkatesh Iyer
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ అదృష్టం మామూలుగా లేదు. ఐపీఎల్ 2025 సీజన్‌లో రూ.23.75 కోట్లకు అమ్ముడుపోయాడు. అయితే.. ఐపీఎల్ 18వ సీజన్‌లో అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యాడు. 11 మ్యాచ్‌లు ఆడాడు. 7 ఇన్నింగ్స్‌ల్లో 142 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో మిగిలిన మ్యాచ్‌ల్లో అతడు బెంచీకే పరిమితం అయ్యాడు. అయినా కానీ తాజాగా మరోసారి అదృష్టం అతడి తలుపుతట్టింది. ఓ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
మధ్యప్రదేశ్ లీగ్(ఎంపీఎల్) రెండో ఎడిషన్‌కు అంతా సిద్ధమైంది. జూన్ 12 నుంచి ఎంపీఎల్ రెండో ఎడిషన్ ప్రారంభం కానుంది. తొలి ఎడిషన్‌లో 5 జట్లు మాత్రమే ఈ లీగ్‌లో పోటీపడగా, తాజాగా మరో రెండు కొత్త ఫ్రాంఛైజీలు చంబల్ ఘరియల్స్, ఇండోర్ పింక్ పాంథర్స్ లు కొత్తగా వచ్చాయి.
Rishabh Pant: పంత్ కొడితే అట్లుంటది మరి.. పగిలిపోయిన స్టేడియం పైకప్పు.. వీడియో వైరల్..
వీటిలో ఇండోర్ పింక్ పాంథర్స్ జట్టుకు వెంకటేశ్ అయ్యర్ నాయకత్వం వహించనున్నాడు. గత సీజన్‌లో గ్వాలియర్ చీతాస్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
ఎంపీఎల్ తొలి సీజన్‌లో వెంకటేశ్ అయ్యర్ 8 మ్యాచ్‌లలో 58.57 సగటుతో 480 పరుగులు చేశాడు. ఇక కొత్త పాత్రలో వెంకటేశ్ అయ్యర్ ఎలా ఆడతాడో చూడాల్సిందే.