భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి సెషన్‌లోనే రెండు వికెట్లను కోల్పోగా ఆట ముగిసేసరికి 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(76; 163బంతుల్లో 10×4), ఓపెనర్ మయాంక్ అగర్వాల్(55; 127బంతుల్లో 7×4) అర్ధశతకాలతో జట్టుకును నిలబెట్టారు.
కేఎల్ రాహుల్, చటేశ్వర్ పుజారా మాత్రం మరోసారి నిరాశపరిచారు. ప్రస్తుతం క్రీజులో హనుమ విహారి(42 బ్యాటింగ్), రిషబ్ పంత్(27 బ్యాటింగ్) ఉన్నారు. ఇక మ్యాచ్ లో తన తన దూకుడు స్వభావాన్ని తగ్గించుకుని పంత్ ఆరంభం నుంచే ఆచితూచి జాగ్రత్తగా ఆడుతున్నాడు. అనవసరపు షాట్లకు పోవట్లేదు. విహారితో కలిసి చక్కగా స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
భారత స్కోరు బోర్డు:
తొలి ఇన్నింగ్స్: రాహుల్ (సి) కార్న్‌వాల్ (బి) హోల్డర్ 13; మయాంక్ (సి) కార్న్‌వాల్ (బి) హోల్డర్ 55; పుజారా (సి) బ్రూక్స్ (బి) కార్న్‌వాల్ 6; కోహ్లీ (సి) హామిల్టన్ (బి) హోల్డర్ 76; రహానె (సి) హామిల్టన్ (బి) రోచ్ 24; రిషబ్ పంత్(27 బ్యాటింగ్), హనుమ విహారీ(42 బ్యాటింగ్) ఎక్స్‌ట్రాలు 21;
మొత్తం: 90 ఓవర్లలో 264/5.
వికెట్ల పతనం: 1-32, 2-46, 3-115, 164-4, 202-5. బౌలింగ్: రోచ్ 19-7-47-1; గాబ్రియెల్ 12-0-57-0; హోల్డర్ 20-6-39-3; కార్న్‌వాల్ 27-8-69-1; చేజ్ 12-4-31-0.