PIC: @RCBTweets
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య లక్నో స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచులో ఆర్సీబీకి వికెట్ కీపర్, బ్యాటర్ జితేశ్ శర్మ సారథిగా వ్యవహరిస్తున్నాడు. రజత్ పటీదార్ స్థానంలో అతడు జట్టులో కెప్టెన్‌గా కనపడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో ఆర్సీబీ ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ మాట్లాడుతూ.. ఐపీఎల్ మ్యాచుల్లో రెండు వారాలకు పైగా వచ్చిన బ్రేక్ ఫ్రాంచైజీకి బాగా ఉపయోగపడిందని అన్నారు. కొంతమంది ఆటగాళ్లు ప్లేఆఫ్‌లకు ముందు తిరిగి ఫామ్‌లోకి రావడానికి ఈ సమయం సాయపడిందని తెలిపారు.
Also Read: ఇది కదా కమల్, మణిరత్నం అంటే.. ఎంత ఎదిగినా.. ఇలా..
“ఆపరేషన్ సిందూర్” తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో ఐపీఎల్‌ను వాయిదా వేయడానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన హోమ్ మ్యాచ్‌లో రజత్ పటీదార్ వేలికి గాయమైన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో రెండు మ్యాచులను అతడు మిస్ అవుతాడని అందరూ భావించారు.
అయితే, అదే సమయంలో ఐపీఎల్ వాయిదా పడడంతో ఈ సమయం అతడికి గాయం నుంచి కోలుకోవడానికి ఉపయోగపడింది. రజత్ పటీదార్ గాయం నుంచి కోలుకున్నాడని, బ్యాటింగ్‌కు ఫిట్‌గా ఉన్నాడని ఆండీ ఫ్లవర్ ఇవాళ తెలిపారు. అయితే, రజత్ పటీదార్‌ను నేటి మ్యాచులో ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకున్నారు.
దీంతో అతడు ఇంకా 100 శాతం కోలుకోలేదని తెలుస్తోంది. ఈ కారణంగానే కెప్టెన్సీని అతడికి కాకుండా జితేశ్ శర్మకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్సీబీ స్టాండ్-ఇన్ కెప్టెన్ జితేశ్ శర్మ దీనిపై మాట్లాడుతూ.. “రజత్ పాటిదార్ ఇంపాక్ట్ ప్లేయర్. మయాంక్ పాడిక్కల్ స్థానంలో వచ్చాడు” అని అన్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు
ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, లుంగి ఎన్గిడి, సుయాష్ శర్మ
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ