Richa Ghosh misses NZ ODIs to sit for class 12 exams
మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా పేలవ ప్రదర్శన చేసింది. కనీసం సెమీస్‌కు కూడా చేరకుండానే నిష్ర్కమించింది. దీంతో జట్టులో భారీ మార్పులు తప్పవని, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పై వేటు పడడం ఖాయం అని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు జట్టును ప్రకటించింది. అయితే.. హర్మన్ సారథ్యంలోనే భారత్ బరిలోకి దిగనుంది.
16 మందితో కూడిన జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఇంటర్ పరీక్షల కారణంగా వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు ఈ సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చారు. గాయంతో లెగ్ స్పిన్నర్ ఆశా శోభన సిరీస్ కు దూరమైంది. ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌కు విశ్రాంతి ఇచ్చారు. ఈ క్రమంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు సయాలీ సత్‌ఘరే, సైమా ఠాకూర్, లెగ్ స్పిన్నర్ ప్రియా మిశ్రా, మిడిలార్డర్ బ్యాటర్ తేజల్ హసబ్నిస్ లు మొదటి సారి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.
IPL 2025 : ముంబై ఇండియన్స్ రిటైన్ లిస్ట్? రోహిత్ శర్మపై ఎంఐ కీలక నిర్ణయం..
భారత్, న్యూజిలాండ్ జట్లు అహ్మదాబాద్ వేదికగా మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో తలపడనున్నాయి. తొలి వన్డే ఈనెల 24న, రెండో వన్డే 27న, మూడో వన్డే 29న జరగనుంది.
కివీస్‌తో సిరీస్‌కు భారత జట్టు..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హేమలత, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, ఉమా ఛెత్రీ, సయాలీ, అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, తేజల్ హసాబ్నిస్, సైమా థాకూర్, ప్రియా మిశ్రా, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్.
A look at #TeamIndia’s squad for the three-match ODI series against New Zealand 👌👌 #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/pKxdLCWsnb
— BCCI Women (@BCCIWomen) October 17, 2024