IND vs SA 1st ODI Match : అయ్యో రింకూ.. వన్డేల్లో అరంగేట్రంకు దక్కని అవకాశం.. సంజూ వైపు మొగ్గు

బ్యాటింగ్ లో ఫుల్ ఫామ్ ను ప్రదర్శిస్తున్న రింకూ సింగ్ కు సౌతాఫ్రికాతో టీమిండియా ఆడే తొలి వన్డేలో మ్యాచ్ లో తప్పని సరిగా అవకాశం దక్కుతుందని భావించినప్పటికీ..

Rinku Singh

Rinku Singh : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆదివారం మొదటి వన్డే ప్రారంభమైంది. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగే వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఈ మ్యాచ్ టీ20ల్లో సిక్సర్ల వీరుడు రింకూ సింగ్ అరంగేట్రం ఖాయమని అందరూ భావించారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ శనివారం మీడియాతో మాట్లాడుతూ రింకూ సింగ్ ఎంట్రీ ఖాయమని చెప్పారు. దీంతో బ్యాటింగ్ కు అనుకూలించే జోహన్నెస్‌బర్గ్‌ మైదానంలో రింకూ సిక్సర్ల మోత ఖాయమని అభిమానులు భావించారు. కానీ, తుది జట్టులో రింకూ సింగ్ కు అవకాశం దక్కలేదు.

Also Read : Rohit Sharma : రోహిత్ శర్మ భార్య రితికా ఆసక్తికర ట్వీట్.. నెటిజన్లు ఫుల్ సపోర్ట్.. ఎందుకంటే?

టీ20 మ్యాచ్ లలో రింకూ సింగ్ సిక్సర్ల మోత మోగిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో టీ20 సిరీస్ లో భాగంగా జరిగిన రెండు మ్యాచ్ లలోనూ రింకూ రాణించాడు. బ్యాటింగ్ లో మంచి ఫామ్ ను ప్రదర్శిస్తున్న రింకూకు సౌతాఫ్రికాతో టీమిండియా ఆడే తొలి వన్డేలో మ్యాచ్ లో తప్పని సరిగా అవకాశం దక్కుతుందని క్రికెట్ అభిమానులు భావించారు. సంజూ శాంసన్ కు బదులు తుదిజట్టులో రింకూ అరంగేట్రం ఉంటుందని భావించినప్పటికీ రింకూకు అవకాశం దక్కలేదు. సంజూ శాంసన్ వైపు టీం యాజమాన్యం మొగ్గు చూపింది. అయితే, వన్డే సిరీస్ లో భాగంగా మరో రెండు మ్యాచ్ లు సౌతాఫ్రికాతో భారత్ జట్టు తలపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లలో రింకూకు అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఈ సిరీస్ లో రింకూ వన్డేల్లో అరంగేట్రం చేయకుంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సి ఉంటుంది.

Also Read : Rohit Sharma : సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా రోహిత్ శర్మ..? ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందా

సౌతాఫ్రికాపై తుదిజట్టులో సాయి సుదర్శన్ అరంగేట్రం చేయనున్నాడు. రుతరాజ్, సాయి సుదర్శన్ ఓపెనర్స్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇదిలాఉంటే జోహన్నెస్‌బర్గ్‌లో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. దీంతో సౌతాఫ్రికా జట్టు భారీ స్కోర్ చేస్తే టీమిండియాకు ఇబ్బంది తప్పదని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ లో సీనియర్ బౌలర్లు ఎవరూ అందుబాటులో లేరు. అర్ష్ దీప్ సింగ్, ఆవేష్ ఖాన్, ముకేశ్ యాదవ్ లపైనే బౌలింగ్ విభాగం ఆధారపడి ఉంది. మరోవైపు స్పిన్ విభాగంలో కుల్ దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఉన్నారు. పార్ట టైం బౌలర్ గా తిలక్ వర్మకూడా అందుబాటులో ఉంటాడు. తొలి పది ఓవరల్లో యువ బౌలర్లు వికెట్లు రాబట్టి సౌతాఫ్రికాపై ఒత్తిడి పెంచితే టీమిండియా విజయం తేలిక అవుతుంది.
భారత్ తుది జట్టు ..
రుతరాజ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్, అవేష్ ఖాన్, కుల్ దీప్ యాదవ్, ముకేశ్ కుమార్.