Rinku Singh
Rinku Singh : ఆసియా కప్ టోర్నీకి ముందు టీమిండియాకు భారీ గుడ్‌న్యూస్. జట్టులోని దిగ్గజ బ్యాటర్ రింకు సింగ్ (Rinku Singh) భీకర ఫామ్‌లోకి వచ్చేశాడు. యూపీ టీ20 లీగ్‌లో రింకూ సిక్సులు, ఫోర్లతో మైదానంలో విధ్వంసం సృష్టించాడు. కేవలం 45 బంతుల్లోనే తుఫాను ఇన్నింగ్స్ తో సెంచరీ పూర్తిచేసిన రింకూ.. అదే సమయంలో ఏడు బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు.
Also Read: Asia Cup 2025 : టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత్, పాక్ పోరు.. ఇక రచ్చరచ్చే..
ఆసియా కప్ టోర్నీకి ముందు రింకూసింగ్ అదరగొట్టాడు. మైదానంలో నలుమూలల అద్భుతమైన షాట్లు కొట్టడం ద్వారా ఆసియా కప్ టోర్నీలో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు హెచ్చరిక జారీ చేశాడు. యూపీ టీ20 లీగ్ లో భాగంగా గురువారం రాత్రి లక్నోలోని ఎకానా స్టేడియంలో గోరఖ్‌పూర్ లయన్స్ వర్సెస్ మీరట్ మావెరిక్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. రింకూ సింగ్ కెప్టెన్సీలో మీరట్ మావెరిక్స్ జట్టు బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గోరఖ్‌పూర్ లయన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అయితే, రింకు సింగ్ తన తుఫాన్ ఇన్నింగ్స్‌తో లక్ష్యాన్ని చేధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
168 పరుగుల లక్ష్యంతో మీరట్ మావెరిక్స్ జట్టు బ్యాటింగ్ ప్రారంభిచింది. అయితే, ఆ జట్టుకు సరియైన ఆరంభం లభించలేదు. కేవలం 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత మైదానంలోకి వచ్చిన కెప్టెన్ రింకు సింగ్ సిక్సులు ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. 225 స్ట్రైక్ రేట్‌తో కేవలం 48 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సుల సహాయంతో 108 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో మీరట్ జట్టు 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకొని.. ఆరు వికెట్ల తేడాతో గోరఖ్‌పూర్ లయన్స్ జట్టుపై విజయం సాధించింది.
CAPTAIN RINKU SINGH 108*(48) IN UPT20 LEAGUE…!!!! 👑🔥
– Relive the One Man Show, A perfect Preparation for Asia Cup. pic.twitter.com/zWF9ECyqy4
— Johns. (@CricCrazyJohns) August 21, 2025
రింకు సింగ్ క్రీజులోకి వచ్చిన దగ్గర నుంచి దూకుడగా ఆడాడు. మైదానం నలువైపుల ఫోర్లు, సిక్సర్లతో గోరఖ్‌పూర్ లయన్స్ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. రింకు తుఫాన్ ఇన్నింగ్స్‌ను అడ్డుకోలేక బౌలర్లు చేతులెత్తేశారు. ఇదిలాఉంటే.. అంతకుముందు గోరఖ్‌పూర్ లయన్స్ కెప్టెన్ ధ్రువ్ జురెల్ ఆరు ఫోర్ల సహాయంతో 32బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఆ జట్టుకు చెందిన ఆకాశ్ దీప్ 23 పరుగులు చేశాడు. వీరిద్దరు మినహా ఆ జట్టులో మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. మూడు మ్యాచ్ లలో మీరట్ జట్టుకు ఇది రెండో విజయం. గోరఖ్‌పూర్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లలో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. మొత్తానికి ఆసియా కప్ టోర్నీకి ముందు రింకు సింగ్ అద్భతు ఫామ్ లోకి రావడం టీమిండియా జట్టుకు శుభవార్తేనని చెప్పొచ్చు.
𝑮𝒐𝒅’𝒔 𝑷𝒍𝒂𝒏, 𝑩𝒂𝒃𝒚 | @rinkusingh235
Watch live on @SonyLIV and @SonySportsNetwk. #UPT20League #ANAXUPT20League #KhiladiYahanBantaHai #MMvsGGL pic.twitter.com/xSodreRP9Q
— UP T20 League (@t20uttarpradesh) August 21, 2025