IPL 2024 : అంపైర్‌తో వాగ్వివాదానికి దిగిన రిషబ్ పంత్.. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు! వీడియో వైరల్

రిషబ్ పంత్ డీఆర్ ఎస్ కోసం సిగ్నల్ ఇచ్చాడని భావించిన అంపైర్ పండిట్ దానిని థర్డ్ అంపైర్ రివ్యూకోసం పంపించాడు. దీంతో పంత్ అంపైర్ వద్దకు వెళ్లి ..

Rishabh Pant

LSG vs DC IPL 2024 : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంత్ సేన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 167 పరుగులు చేసింది. ఆ తరువాత 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. దీంతో సూపర్ జెయింట్స్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో పంత్ సేన విజయం సాధించింది.

Also Read : IPL 2024 : 2014 ఐపీఎల్ సీజ‌న్‌లో నమోదైన రికార్డును బద్దలుకొట్టిన బదోని, అర్షద్ జోడీ

మ్యాచ్ సందర్భంగా డీసీ కెప్టెన్ రిషబ్ పంత్ డీఆర్ఎస్ కాల్ విషయంలో అన్ ఫీల్డ్ అంపైర్ రోహన్ పండిట్ తో వాగ్వాదానికి దిగాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లక్నో జట్టు బ్యాటింగ్ చేస్తున్నసమయంలో డీసీ జట్టు పేసర్ ఇషాంత్ శర్మ మూడో ఓవర్ వేశాడు. ఈ క్రమంలో థర్డ్ ఓవర్లో ఇషాంత్ వేసిన నాల్గో బంతి లెగ్ సైడ్ లో వెళ్లింది. లక్నో బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ఆ బాల్ ను స్వ్కేర్ లెగ్ వైపు క్లిక్ చేయాలనే ప్రయత్నంలో విఫలమయ్యాడు. ఆ బంతిని అంపైర్ పండిట్ వైడ్ డెలివరీగా నిర్ధారించాడు. ఆ సమయంలో కెప్టెన్ పంత్ డీఆర్ఎస్ కోరుతూ సిగ్నల్ చూపినట్లు కనిపించింది.. ఈ విషయంపై కొద్దిసేపటికే అంపైర్, పంత్ మధ్య వాగ్వివాదం జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read : IPL 2024 : రిషబ్ పంత్, ఫ్రేజర్ విజృంభణ.. 6 వికెట్ల తేడాతో లక్నోపై ఢిల్లీ విజయం..!

రిషబ్ పంత్ డీఆర్ ఎస్ కోసం సిగ్నల్ ఇచ్చాడని భావించిన అంపైర్ పండిట్ దానిని థర్డ్ అంపైర్ రివ్యూకోసం పంపించాడు. దీంతో పంత్ అంపైర్ వద్దకు వెళ్లి అతనితో వాదనకు దిగాడు. నేను డీఆర్ఎస్ కోరలేదని సూచించాడు. నేను ఫీల్డర్ కు సిగ్నల్ ఇచ్చానని, డీఆర్ఎస్ కాల్ ను ఉపసంహరించుకోవాలని అంపైర్ తో పంత్ వాగ్వివాదానికి దిగాడు. అయితే, టీవీ రిప్లైలో మాత్రం పంత్ అంపైర్ వైపు చూడకుండా డీఆర్ఎస్ కోరుతూ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఉంది. దీంతో థర్డ్ అంపైర్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఆ బాల్ ను వైడ్ గా ప్రకటించాడు. ఫలితంగా డీసీ జట్టు ఒక రివ్యూను కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ట్రెండింగ్ వార్తలు