IND vs SA : రిషబ్ పంత్ బౌండరి…గాల్లోకి ఎగిరిన బ్యాట్

ఒకడుగు ముందుకేసి షాట్ కొట్టాడు. బంతి బ్యాట్ కు తగిలి..బౌండరీ వైపు దూసుకెళ్లింది. కానీ..రిషబ్ పంత్ చేతిలో మాత్రం బ్యాట్ లేదు. అతడి బ్యాట్ చేతుల నుంచి జారిపోయి కొద్ది దూరంలో....

Rishabh Pant Bat Slip : టీమిండియా బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దక్షిణాఫ్రికా – టీమిండియా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పంత్ బ్యాటింగ్ చేస్తుండగా ఓ సరదా సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. ఒలీవియర్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఒకడుగు ముందుకేసి షాట్ కొట్టాడు. బంతి బ్యాట్ కు తగిలి..బౌండరీ వైపు దూసుకెళ్లింది. కానీ..రిషబ్ పంత్ చేతిలో మాత్రం బ్యాట్ లేదు. అతడి బ్యాట్ చేతుల నుంచి జారిపోయి కొద్ది దూరంలో పడిపోయింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఏమీ కాలేదు. దీనిని కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.

Read More : ICC U19 World Cup 2022: భవిష్యత్ క్రికెటర్ల మెరుపులు.. నేటి నుంచే ప్రపంచకప్!

సెకండ్ ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ వినూత్న ఆట తీరును కనబరిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి..ఎంతో ఒపికగా బ్యాటింగ్ చేశాడు. ఇతను క్రీజులో పాతుకపోయాడు. వికెట్లు పడుతున్నా..ఎంతో సహనంతో క్రమశిక్షణగా బ్యాటింగ్ చేశాడు. 139 బంతుల్లో 6 బౌండరీలు సాధించిన పంత్…4 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించి..నాటౌట్ గా నిలిచాడు. టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 223 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 210 పరుగులే సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో భారత్ 198 పరుగులకు ఆలౌట్ అయింది. 212 పరుగుల టార్గెట్ తో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.

ట్రెండింగ్ వార్తలు