Rishabh Pant : ఒకే ఓవ‌ర్‌లో రిష‌బ్ పంత్ 4,6,6,4,4,4 .. షారుఖ్ ఖాన్ రియాక్ష‌న్ వైర‌ల్‌

విశాఖ వేదిక‌గా బుధ‌వారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ రిష‌బ్‌పంత్ అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు.

screengrab from video posted on x by@jiocinema

Rishabh Pant – Shah Rukh Khan : విశాఖ వేదిక‌గా బుధ‌వారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ రిష‌బ్‌పంత్ అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు. 25 బంతుల్లో 55 ప‌రుగులు చేసి ఈ సీజ‌న్‌లో వ‌రుస‌గా రెండో హాఫ్ సెంచ‌రీని న‌మోదు చేశాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లు ఉన్నాయి. కోల్‌క‌తా భారీ స్కోరు చేసిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ చిత్తు చిత్తుగా ఓడిపోయిన‌ప్ప‌టికీ కూడా పంత్ ఫామ్‌లోకి రావ‌డం ఢిల్లీకి మాత్ర‌మే కాకుండా భార‌త క్రికెట్ అభిమానులు అంద‌రికి ఎంతో ఉత్సాహాన్ని అందించింది.

2022 డిసెంబ‌ర్‌లో రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన రిష‌బ్ పంత్ చాలా కాలం ఆట‌కు దూరంగా ఉన్నాడు. ఈ ఐపీఎల్ సీజ‌న్‌తోనే పున‌రాగ‌మ‌నం చేశాడు. మొద‌టి రెండు మ్యాచుల్లో కొంత ఇబ్బంది ప‌డిన పంత్‌.. ఆ త‌రువాతి రెండు మ్యాచుల్లో వ‌రుస‌గా రెండు హాఫ్ సెంచ‌రీలు బాది ఫామ్‌లోకి వ‌చ్చాడు. కాగా.. విశాఖ మ్యాచ్‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్ బౌలింగ్‌లో కొట్టిన సిక్స్ గురించి ఎంత చెప్పుకున్నా కూడా త‌క్కువే అవుతుంది. వెంక‌టేశ్ అయ్య‌ర్ లెగ్ స్టంప్ ఆవ‌ల వైడ్‌గా బంతిని వేయ‌గా, పంత్ బంతిని చూడ‌కుండానే దానిని డీప్ ఫైన్ లెగ్ రీజియ‌న్ వైపు ప్లిక్ చేసి సిక్స‌ర్‌గా మలిచాడు.

Rohit Sharma : రోహిత్ ముంబైని న‌డిపిస్తాడు.. అయితే.. : మాజీ క్రికెట‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

పంత్ కొట్టిన ఈ షాట్‌ అంద‌రిని అబ్బుర‌ప‌రిచింది. ముఖ్యంగా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ స‌హ య‌జ‌మాని షారుఖ్ ఖాన్ సైతం పంత్ షాట్‌ను అభినందించ‌కుండా ఉండ‌లేకపోయాడు. లేచి నిల‌బ‌డి మ‌రీ చ‌ప్ప‌ట్ల‌తో పంత్‌ను అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఓవ‌ర్‌లో పంత్ వ‌రుస‌గా 4,6,6,4,4,4 బాది 28 ప‌రుగులు రాబ‌ట్టాడు.

ఈ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత‌ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 272 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో సునీల్ న‌రైన్ (39 బంతుల్లో 85 ప‌రుగులు), ర‌ఘువంశీ(27 బంతుల్లో 54 ప‌రుగులు), ర‌సెల్ (19 బంతుల్లో 41ప‌రుగులు), రింకూసింగ్‌(8 బంతుల్లో 26ప‌రుగులు) చేశారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు 17.2ఓవ‌ర్ల‌లో 166 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఢిల్లీ బ్యాట‌ర్లో రిష‌బ్‌పంత్ (25 బంతుల్లో 55 ప‌రుగులు), ట్రిస్టియ‌న్ స్ట‌బ్స్ (32 బంతుల్లో 54 ప‌రుగులు) అర్ధ‌శ‌త‌కాలతో పోరాడినా 106 ప‌రుగుల తేడాతో ఓడిపోయారు.

Michael Clarke : హార్దిక్ పై ఎడ‌తెగ‌ని హేళ‌న‌ను ఆపేందుకు ఏకైక మార్గం అదే : మైకేల్ క్లార్క్‌

ట్రెండింగ్ వార్తలు