Rishabh Pant : బ‌ల‌వంతం చేయొద్దు..రిష‌బ్ పంత్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ.. ఎవ‌రిని ఉద్దేశించి..?

Rishabh Pant Instagram Story : రిష‌బ్ పంత్ సోష‌ల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

Rishabh Pant

గతేడాది రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ కోలుకుంటున్నాడు. ప్ర‌స్తుతం అత‌డు ఫిట్‌నెస్ సాధించే ప‌నిలో ఉన్నాడు. అయితే.. శ‌నివారం పంత్ సోష‌ల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంత్ ఓ మెసేజ్‌ను పోస్ట్ చేశాడు. ‘స్నేహాం లేదా బంధాలు ఏదైనా కానివ్వండి. అవి కొన‌సాగుతున్నా లేదా విడిపోయిన‌ప్ప‌టికీ వాటిని బ‌ల‌వంతం చేయొద్దు.’ అని పంత్ పోస్ట్ చేశాడు. అయితే.. పంత్ ఎవ్వ‌రి పేరును చెప్ప‌లేదు. దీంతో అత‌డు ఎవ‌రిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశాడు అన్న చ‌ర్చ మొద‌లైంది.

ఐపీఎల్ ఆడ‌తాడు..

ప్ర‌మాదం కార‌ణంగా గ‌త ఐపీఎల్‌ సీజ‌న్ ఆడ‌లేక‌పోయిన పంత్ ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో ఖ‌చ్చితంగా ఆడ‌తాడ‌ని భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ అయిన సౌరవ్ గంగూలీ ఇటీవ‌ల చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్ 2024లో అత‌డు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు కెప్టెన్ వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని చెప్పుకొచ్చారు. జ‌న‌వ‌రి నాటికి పంత్ పూర్తిగా కోలుకుంటాడ‌ని, ఆ త‌రువాత అత‌డు ప్రాక్టీస్ మొద‌లు పెట్ట‌నున్న‌ట్లు చెప్పాడు. అయితే.. రిష‌బ్ పంత్ ఎప్పుడు టీమ్ఇండియా త‌రుపున బ‌రిలోకి దిగుతాడో అన్న సంగ‌తి అయితే ప్ర‌స్తుతానికి తెలియ‌దు. కాగా.. పంత్ త్వ‌ర‌గా మైదానంలో అడుగుపెట్టాల‌ని అత‌డి అభిమానులు కోరుకుంటున్నారు.

Ravi Shastri : ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌డం అంత ఈజీ కాదు.. ర‌విశాస్త్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Rishabh Pant Instagram Story

ఇదిలా ఉంటే.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు ఐపీఎల్ 2024 సంబంధించిన మినీ వేలానికి సిద్ధం అవుతోంది. ఈ క్ర‌మంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు మొత్తంగా 11 మంది ఆట‌గాళ్ల‌ను విడుద‌ల చేయ‌గా 16 మందిని అట్టిపెట్టింది. రిలీ రూసో, ముస్తాఫిజుర్ రెహమాన్, రోవ్‌మన్ పావెల్, ఫిల్ సాల్ట్‌, మనీష్ పాండే, సర్ఫరాజ్ ఖాన్, ప్రియమ్ గార్గ్, చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, రిపల్ పటేల్, అమన్ ఖాన్ ల‌ను ఢిల్లీ విడిచిపెట్టింది.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ అట్టి పెట్టుకున్న ఆట‌గాళ్లు వీరే..

రిషబ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, అన్రిచ్‌ నోర్జే, లుంగి ఎంగిడి. ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, లలిత్ యాదవ్, ప్రవీణ్ దూబే, ముఖేష్ కుమార్, యశ్ ధుల్, విక్కీ ఓస్త్వాల్, అభిషేక్ పోరెల్.

RCB : దుర‌దృష్టం అంటే ఆర్‌సీబీదే..! ఆ జ‌ట్టు వ‌దిలేసిన ఆట‌గాళ్లు ఇతర ఫ్రాంచైజీల్లో మెరుగైన ప్రదర్శన

ట్రెండింగ్ వార్తలు