IND vs ENG: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్ జట్టు ఇంగ్లాండ్ కు చేరుకుంది. ప్రాక్టీస్ లో నిమగ్నమైంది. అయితే, ప్రాక్టీస్ సమయంలో టీమిండియా కీలక ప్లేయర్ గాయపడ్డాడు. బంతి అతని ఎడమ చేతికి బలంగా తగిలింది. ఆ తరువాత అతను నెట్స్‌లో ప్రాక్టీస్ చేయకుండానే వెళ్లిపోయాడు.
శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ వెళ్లిన జట్టులో చాలా మంది యువ ప్లేయర్లు ఉన్నారు. అయితే, రిషబ్ పంత్, జస్ర్పీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి అనుభవజ్ఞులైన ప్లేయర్లు ఈ పర్యటనలో కీలక పాత్ర పోషించనున్నారు. ఆదివారం ప్రాక్టీస్ సమయంలో వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. అతని ఎడమ చేతికి గాయమైంది. రిషబ్ పంత్ ఈ సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గానూ ఉన్నాడు.
టీమిండియా జూన్ 6న ఇంగ్లాండ్ చేరుకుంది. జూన్ 7న లార్డ్స్ లో జట్టు ఫిట్‌నెస్ డ్రిల్స్ చేసింది. లండన్ నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెకెన్‌హామ్‌లో జూన్ 8న టీమిండియా ప్రాక్టీస్ ప్రారంభించింది. టీం సభ్యులు ఇక్కడ పదిరోజులు ప్రాక్టీస్ చేయనున్నారు.
రెవ్‌స్పోర్ట్జ్ నివేదిక ప్రకారం.. రిషబ్ పంత్ నెట్స్ లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి అతని ఎడమ చేతికి తగిలింది. అతనికి చాలా నొప్పి అనిపించింది. ఆ తరువాత వెంటనే వైద్య బృందాన్ని పిలిపించారు. పరీక్ష తరువాత పంత్ చేతికి ఐస్ ప్యాక్ వేశారు. కొంత సమయం తరువాత కట్టు కట్టారు. దీని తరువాత పంత్ ప్రాక్టీస్ చేయలేదు. అయితే, పంత్ గాయం తీవ్రత ఏ స్థాయిలో ఉందనే విషయాలు తెలియాల్సి ఉంది. ఒకవేళ గాయం అయినప్పటికీ టెస్టు సిరీస్ ప్రారంభానికి మరో పదిరోజులు సమయం ఉండటంతో అప్పటి వరకు పంత్ పూర్తిస్థాయిలో కోలుకునే అవకాశం ఉంది.
𝗣𝗿𝗲𝗽 𝗕𝗲𝗴𝗶𝗻𝘀 ✅
First sight of #TeamIndia getting into the groove in England 😎#ENGvIND pic.twitter.com/TZdhAil9wV
— BCCI (@BCCI) June 8, 2025
భారత టెస్ట్ జట్టు..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్, షర్దుల్ థామ్, షర్దుల్ థామ్‌రాహ్ , షర్దుల్ థామ్‌కౌర్ ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.