అంపైర్ నిర్ణయంపై యశస్వి జైస్వాల్ ఆగ్రహం.. అవుట్ ఇచ్చినా పెవిలియన్‌కు వెళ్లకుండా.. చివరికి ఏమైందంటే..? వీడియో వైరల్
అంపైర్ నిర్ణయంపై జైస్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంపైర్ ఔట్ ఇచ్చినా క్రీజు వదిలి వెళ్లకుండా ..

India vs England Test: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఈనెల 20 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో భారత -ఏ జట్టు రెండు టెస్లు మ్యాచ్ ల అనధికారిక సిరీస్ లు ఆడుతుంది. శుక్రవారం మొదలైన ఈ నాలుగు రోజుల మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ -ఏ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (116 పరుగులు ) సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ పర్యటనలో తొలి మ్యాచ్ ఆడిన రాహుల్ నిలకడైన బ్యాటింగ్ తో శతకం పూర్తి చేశాడు.
Also Read: Rishabh Pant : అయ్యో పంత్.. రోహిత్ శర్మ ఆ పని చేస్తున్నాడా ? ఇది గనుక హిట్‌మ్యాన్ వింటే నీ పని…
వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురెల్ (52), కరుణ్ నాయర్ (40) కీలక ఇన్నింగ్స్ ఆడారు. తనుష్ కొటియన్ (5), అన్షుల్ కాంబోజ్ (1) క్రీజులో ఉన్నారు. అయితే, ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (17) పరుగులు మాత్రమే చేశాడు. అంపైర్ జైస్వాల్ ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ ఇవ్వడంతో.. అంపైర్ నిర్ణయంపై జైస్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన రెండవ అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా టాస్ ఓడిన భారత్-ఎ జట్టు తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చి ఇన్నింగ్స్ ప్రారంభించారు. జైస్వాల్ 26 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 17 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ వోక్స్ వేసిన బంతి జైస్వాల్ ఫ్యాడ్స్ కు తగిలింది. దీంతో అంపైర్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ ఇచ్చాడు.
అంపైర్ నిర్ణయంపై జైస్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంపైర్ ఔట్ ఇచ్చినా క్రీజు వదిలి వెళ్లకుండా జైస్వాల్ అంపైర్ వైపు ఇది అవుట్ కాదన్నట్లుగా సైగచేస్తూ ఉండిపోయాడు. అయినా అంపైర్ అవుట్ అంటూ ప్రకటించడంతో చివరికి జైస్వాల్ క్రీజును వదిలి పెవిలియన్ వైపు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Jaiswal lbw 17 to Woakes … not sure he necessarily agreed with the decision pic.twitter.com/b3w7dHP5uA
— Ali Martin (@Cricket_Ali) June 6, 2025