Rishabh Pant : అయ్యో పంత్.. రోహిత్ శర్మ ఆ పని చేస్తున్నాడా ? ఇది గనుక హిట్‌మ్యాన్ వింటే నీ పని…
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు ముంబై ఎయిర్‌పోర్టులో పంత్‌కు ఓ ప్రశ్న ఎదురైంది.

Rishabh Pant hilarious response on Rohit Sharma absence for England series video viral
శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరింది. శుక్రవారం ముంబైలోని విమానాశ్రయం నుంచి ఆటగాళ్లు ఇంగ్లాండ్‌కు పయనం అయ్యారు. ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ జట్టు ఆతిథ్య జట్టుతో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు చెప్పడంతో సుదీర్ఘ ఫార్మాట్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ ఎంపిక అయిన సంగతి తెలిసిందే. కాగా.. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు ముంబై ఎయిర్‌పోర్టులో పంత్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. ఇందుకు అతడు ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Question – where is Rohit Sharma?
Rishabh Pant – Rohit bhai Garden mein ghum rahe hain, unke Garden ki yaad to aayegi (He’s enjoying in the Garden, will miss his Garden). 😂❤️pic.twitter.com/a5x4tlAeYq
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 6, 2025
రోహిత్ శర్మ ఎక్కడ అంటూ ఓ ఫ్యాన్స్‌ను రిషబ్ పంత్‌ను అడిగాడు. అతడు గార్డెన్(తోట)లో తిరుగుతున్నాడు అని పంత్ సమాధానం ఇచ్చాడు. హిట్‌మ్యాన్ ను మిస్ అవుతున్నారా? అని అడుగగా.. అవును అని సమాధానం ఇచ్చాడు.
పంత్ ఇలా ఎందుకు అన్నాడంటే..?
రోహిత్ శర్మ గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడు మైదానంలో సహచర ఆటగాళ్లతో సరదాగా ఉంటూనే పంచ్‌లు వేస్తుంటాడు. అతడు మాట్లాడే మాటలు స్టంప్ మైక్‌లో రికార్డు అయి వైరల్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక 2024 ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఆ సమయంలో వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా ఫీల్డింగ్ చేస్తోంది.
ఆ సమయంలో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ.. భారత ఆటగాళ్లు చురుకుగా లేకపోవడం గమనించి ఆటగాళ్లను కాస్త స్తుతి మెత్తగా మందలించాడు. గార్డెన్‌లో తిరుగుతున్నట్లుగా నడవకండి అని అన్నాడు.