Rishabh Pant: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఆసియా‌కప్‌‌కు జట్టులోకి రాహుల్, శ్రేయాస్..? రిషబ్ పంత్ వీడియో వైరల్ ..

ఆసియా‌కప్‌ టోర్నీలో టీమిండియాలో చేరడమే లక్ష్యంగా రాహుల్, శ్రేయాస్ ప్రాక్టీస్ కొనసాగుతుంది. అయితే, మరో రెండుమూడు రోజుల్లో బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించనుంది.

KL Rahul And Shreyas

KL Rahul And Shreyas: ఆగస్టు 30న ప్రారంభం కానున్న ఆసియా కప్-2023 టోర్నీలో ఆడేందుకు భారత్ జట్టులోకి మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ చేరబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వారు ఇటీవల గాయాలతో భారత జట్టుకు దూరమయ్యారు. గాయాల నుంచి కోలుకోవటంతో ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో వారిద్దరూ ప్రాక్టిస్ చేస్తున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేశాడు. ఇందులో రాహుల్, శ్రేయాస్‌లు బ్యాటింగ్ చేస్తున్నారు. ఆసియా‌కప్‌ టోర్నీలో భారత్ జట్టులో చేరడమే లక్ష్యంగా వారి ప్రాక్టీస్ కొనసాగుతోంది. అయితే, మరో రెండుమూడు రోజుల్లో ఆసియా కప్ టోర్నీకి బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రాహుల్, శ్రేయాస్ ఏమేరకు ఫిట్‌నెస్ సాధిస్తారనే ప్రశ్నార్థకంగా మారింది.

Team India : వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఓట‌మి.. భార‌త్ ఖాతాలో చేరిన చెత్త రికార్డులు ఇవే..

టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్.. రాహుల్, శ్రేయాస్ విషయంపై ఇటీవల స్పందిస్తూ.. ఫిట్‌నెస్ సాధిస్తే వారు ఆసియా కప్ టోర్నీలో చేరే అవకాశం ఉందని చెప్పారు. ఐపీఎల్ 2023లో లక్నోసూపర్ జెయింట్స్ తరపున ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. అప్పటి నుంచి టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. రాహుల్ టీమిండియా తరపున మార్చిలో ఆస్ట్రేలియాతో భారత్ తరపున ఆడాడు. శ్రేయాస్ అయ్యర్ ఈ ఏడాది ప్రారంభంలో గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోపీ తరువాత అయ్యర్ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు.

Rishabh Pant Instagram story

Steven Finn : మ‌రో ప్లేయ‌ర్ రిటైర్‌మెంట్‌.. నెల‌రోజుల వ్య‌వ‌ధిలో న‌లుగురు ఇంగ్లీష్ ఆట‌గాళ్లు ఆట‌కు వీడ్కోలు

బీసీసీఐ ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంప కప్‌ను దృష్టిలో ఉంచుకొని ఆసియా కప్ టోర్నీకి టీమిండియా జట్టును ప్రకటించనుంది. ఆసియా కప్ టోర్నీలో ఎంపికైన ప్లేయర్స్‌కే ప్రపంచ‌ కప్ జట్టులోకి ఎంట్రీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ క్రమంలో రాహుల్, శ్రేయాస్ అయ్యర్ తమ ఫిట్‌నెస్ నిరూపించుకొని ఏ మేరకు ఆసియాకప్ టోర్నీకి భారత్ జట్టులో చేరుతారో వేచి చూడాల్సిందే.

 

ట్రెండింగ్ వార్తలు