Riyan Parag : రియాన్ ప‌రాగ్ మెరుపు శ‌త‌కం.. వెస్టిండీస్ దిగ్గ‌జం వివ్ రిచ‌ర్డ్స్ రికార్డు స‌మం

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాడు రియాన్ ప‌రాగ్ రంజీ ట్రోఫీలో అద‌ర‌గొడుతున్నాడు.

Riyan Parag equals Viv Richards' feat

Riyan Parag century : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాడు రియాన్ ప‌రాగ్ రంజీ ట్రోఫీలో అద‌ర‌గొడుతున్నాడు. అస్సాం జ‌ట్టు త‌రుపున బ‌రిలోకి దిగిన ప‌రాగ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 56 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు. ఈ క్ర‌మంలో రంజీట్రోఫీలో వేగ‌వంత‌మైన సెంచ‌రీ బాదిన రెండో ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 2016లో రిష‌బ్‌పంత్ 48 బంతుల్లో జార్ఖండ్ పై సెంచ‌రీ చేసి ఈ జాబితాలో అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

ఇక ఈ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ప‌రాగ్ 87 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 12 సిక్స‌ర్ల‌తో 155 ప‌రుగులు చేశాడు. ప‌రాగ్ భారీ శ‌త‌కం చేసిన‌ప్ప‌టికీ ఈ మ్యాచ్‌లో అస్సాం ఓడిపోయింది. మొద‌టి ఇన్నింగ్స్‌లో అస్సాం 327 ప‌రుగులు చేసింది. కెప్టెణ్ అమ‌న్‌దీప్ (116) శ‌త‌కంతో రాణించారు. అనంత‌రం సౌరభ్‌ ముజుందార్ ఐదు వికెట్లతో స‌త్తాచాట‌డంతో తొలి ఇన్నింగ్స్‌లో అస్సాం 159 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దెనిష్‌దాస్ (52) ఒక్క‌డే హాఫ్ సెంచ‌రీ చేశాడు.

IND vs ENG : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్‌..! క‌ష్టాలు త‌ప్పేలా లేవుగా..!

ఈ క్ర‌మంలో అస్సాం ఫాలోఆన్ ఆడింది. రియాన్ ప‌రాగ్ భారీ శ‌త‌కం చేయ‌డంతో రెండో ఇన్నింగ్స్‌లో 254 ప‌రుగులకు ఆలౌటైంది. దీంతో ఛ‌త్తీస్‌గ‌డ్ ముందు 86 ప‌రుగుల స్వ‌ల్ప‌ ల‌క్ష్యం నిలిచింది. ఈ ల‌క్ష్య‌న్ని ఛ‌త్తీస్‌గ‌ఢ్ 20 ఓవ‌ర్ల‌లో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. కాగా.. ఛ‌త్తీస్‌గ‌డ్ జ‌న‌వ‌రి 12నుంచి బీహార్‌తో త‌ల‌ప‌డ‌నుండ‌గా, జ‌న‌వ‌రి 19 నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో అస్సాం ఆడ‌నుంది.

వివ్ రిచర్డ్స్ రికార్డు స‌మం..

తాజా శ‌త‌కంతో రియాన్ ప‌రాగ్‌లో ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో వేగ‌వంత‌మైన సెంచ‌రీ చేసిన నాలుగో భార‌త ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. అదే స‌మ‌యంలో విండీస్ దిగ్గ‌జ ఆట‌గాడు వివ్ రిచర్డ్స్ రికార్డును స‌మం చేశాడు. 1985-86 సీజ‌న్‌లో రిచ‌ర్డ్స్ సైతం 56 బంతుల్లోనే శ‌త‌కం బాదాడు.

ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో వేగవంత‌మైన సెంచ‌రీ చేసిన భార‌త ఆట‌గాళ్లు..

శ‌క్తిసింగ్ – 45 బంతుల్లో
రిష‌బ్‌పంత్ – 48 బంతుల్లో
యూస‌ఫ్ ప‌ఠాన్ – 51 బంతుల్లో
రియాన్ ప‌రాగ్ -56 బంతుల్లో

KL Rahul : కేఎల్ రాహుల్ టీ20ల‌కు ప‌నికిరాడా..? జ‌ట్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేంటి..?

ట్రెండింగ్ వార్తలు