Robin Uthappa Fires on IND vs SA 4th T20 is called off due to excessive fog
IND vs SA : బుధవారం లక్నో వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ దట్టమైన పొగమంచు కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైంది. కనీసం టాస్ కూడా వేయలేదు. సాయంత్రం 6.30 గంటలకు టాస్ వేయాల్సి ఉంది. అయితే.. పొగమంచు కారణంగా టాస్ వాయిదా పడుతూ వచ్చింది. పలు మార్లు మైదానాన్ని తనిఖీ చేసిన అంపైర్లు చివరికి 9.25 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయిచారు.
కాగా.. దీనిపై 2007 టీ20 ప్రపంచకప్ విజేత రాబిన్ ఉతప్ప మండిపడ్డాడు. ఈ మ్యాచ్‌కు (IND vs SA) కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న ఉతప్ప.. అంపైర్ల నిర్ణయం పై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అంపైర్ల నిర్ణయం తనను షాకింగ్‌కు గురి చేసిందన్నాడు.
AUS vs ENG : నా రికార్డునే బ్రేక్ చేస్తావా అంటూ కుర్చీ లేపిన మెక్‌గ్రాత్.. వీడియో వైరల్..
రాత్రి సమయం గడిచే కొద్ది పొగమంచు తగ్గుతుందని అనుకోవడం పెద్ద పొరపాటు అని అన్నాడు. ఇంతకంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లను ఆడినట్లుగా గుర్తు చేసుకున్నాడు. వాటితో పోల్చుకుంటే ఈ మైదానంలో పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉన్నాయన్నాడు.
𝐔𝐩𝐝𝐚𝐭𝐞: The fourth India-South Africa T20I is called off due to excessive fog.#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/QWDUVFxVlP
— BCCI (@BCCI) December 17, 2025
ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ప్రస్తుతానికి భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఇక ఈ సిరీస్‌లో ఆఖరిదైన టీ20 మ్యాచ్ శుక్రవారం (డిసెంబర్ 19) అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.
Shah Rukh Khan : కేకేఆర్ ఫ్రాంచైజీ ద్వారా షారుఖ్ ఖాన్ ఏడాదికి ఎంత సంపాదిస్తాడు?
ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే 3-1 తో సిరీస్ సొంతం అవుతుంది. ఒకవేళ సౌతాఫ్రికా విజయం సాధిస్తే.. అప్పుడు 2-2తో సిరీస్ సమం అవుతుంది. ఇప్పటికే టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు అక్షర్‌పటేల్, శుభ్‌మన్ గిల్‌లు ఆఖరి మ్యాచ్‌కు దూరం అయిన సంగతి తెలిసిందే.