×
Ad

Rohit Sharma: సౌతాఫ్రికాతో మూడో వన్డే.. రోహిత్ శర్మ అరుదైన మైలురాయి.. సచిన్, కోహ్లి, ద్రవిడ్ సరసన..

ఆ తర్వాత విరాట్ కోహ్లి 27వేల 910 పరుగులు చేశాడు. ద్రవిడ్ 24వేల 064 పరుగులు చేశాడు. వీరు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

Courtesy @ ESPNCricinfo

Rohit Sharma: విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో మూడో వన్డేలో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో మొత్తం మూడు ఫార్మాట్లలో (టెస్టులు, వన్డేలు, టీ20లు) 20వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. మూడో వన్డేలో 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హిట్ మ్యాన్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో ఇండియన్ ప్లేయర్ గా ఖ్యాతి గడించాడు.

20వేల రన్స్ చేసిన లిస్టులో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ టాప్ లో ఉన్నాడు. సచిన్ 34వేల 357 రన్స్ చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లి 27వేల 910 పరుగులు చేశాడు. ద్రవిడ్ 24వేల 208 పరుగులు చేశాడు. వీరు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. రోహిత శర్మ వన్డేల్లో 11వేల 468 పరుగులు చేశాడు. టెస్టుల్లో 4వేల 301 రన్స్, టీ20ల్లో 4వేల 231 పరుగులు చేశాడు.

ఓవరాల్‌గా తన అంతర్జాతీయ కెరీర్‌లో 50 సెంచరీలు నమోదు చేశాడు. వన్డేల చరిత్రలో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ కొనసాగుతున్నాడు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రికార్డు కూడా రోహిత్‌ (264) పేరునే ఉంది.

Also Read: ప్ర‌సిద్ధ్ కృష్ణ పై కేఎల్ రాహుల్ ఫైర్‌.. నీ బుర్ర వాడాల్సిన అవ‌స‌రం లేదు.. నేను చెప్పినట్లు చేయి.. వీడియో వైర‌ల్